Dasara Movie: నాని ‘దసరా’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే..?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, ధూంధాం దోస్తాన్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Nani Dasara Movie Teaser Release Date Locked
Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, ధూంధాం దోస్తాన్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమాను పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
Dasara: క్లైమాక్స్‌ను షురూ చేసిన నాని..నాన్‌స్టాప్‌గా ముగించేస్తాడట!
ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అనౌన్స్‌మెంట్ ఇవాళ ఉండబోతుందని చిత్ర యూనిట్ నిన్న తెలిపింది. అన్నట్లుగానే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ‘దసరా’ మూవీ టీజర్‌ను జనవరి 30న రిలీజ్ చేస్తున్నట్లు ఓ వీడియో రూపంలో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ టీజర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో నాని పూర్తి తెలంగాణ యాసలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
Nani Dasara Movie: రిలీజ్‌కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసిన నాని సినిమా!
కాగా, ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే జనవరి 30 వరకు వెయిట్ చేయాల్సిందే.