Nani Dasara : ‘దసరా’కు టికెట్ రేట్లు పెంచి నాని తప్పు చేశాడా?? ఇలా అయితే కష్టమే..

నాని కెరీర్ లోనే మొదటి సారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దసరా. దీన్ని పాన్ ఇండియా కూడా రిలీజ్ చేయబోతున్నాడు. దీంతో చిత్రయూనిట్ అంతా కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా దసరా సినిమాని మార్చ్ 30న...............

Nani Dasara : ‘దసరా’కు టికెట్ రేట్లు పెంచి నాని తప్పు చేశాడా?? ఇలా అయితే కష్టమే..

Nani Dasara Movie ticket Prices Increased

Nani Dasara :  న్యాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా దసరా(Dasara). మొదటి సారి పూర్తిగా నాని ఊర మాస్ లుక్ లో సినిమా చేస్తుండటం, ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ రా అండ్ రస్టిక్ గా ఉండి అభిమానులని, ప్రేక్షకులని సినిమా కోసం వెయిట్ చేసేలా చేశాయి. ఇక పాటలు అయితే బాగా హిట్ అయి రిపీట్ గా వినిపిస్తూనే ఉన్నాయి.

నాని కెరీర్ లోనే మొదటి సారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దసరా. దీన్ని పాన్ ఇండియా కూడా రిలీజ్ చేయబోతున్నాడు. దీంతో చిత్రయూనిట్ అంతా కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా దసరా సినిమాని మార్చ్ 30న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సినిమాపై మంచి అంచనాలే ఉండటంతో సినిమా చూడటానికి అభిమానులు, సినిమా ప్రేమికులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కొంతమంది టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు.

అయితే గతంలో కొన్ని సినిమాలకు టికెట్ రేట్ ఏకంగా 295 పెట్టడంతో చాలా సినిమాలు దెబ్బ తిన్నాయి. అంత పెట్టి సినిమా చూడటం కంటే ఓటీటీలోకి వచ్చాక చూసుకోవడం బెటర్ అని అంతా అభిప్రాయపడ్డారు. దీంతో కొన్ని సినిమాలు బాగున్నా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కలెక్షన్స్ రాలేదు. ఈ విషయం అర్థమయ్యాక మ్యాగ్జిమమ్ 200 రూపాయలు టికెట్ రేట్ పెడుతున్నారు. మల్టీప్లెక్స్ లో కూడా 200 ఉంటుంది. కొన్ని సినిమాలు అయితే 175 లకే తమ సినిమా టికెట్ రేట్లని పెట్టారు. ఇటీవల వచ్చిన ఏ సినిమా టికెట్ రేటు కూడా 200 దాటలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు నాని దసరా సినిమాకు ఏకంగా 295 రూపాయలు టికెట్ రేటు పెట్టాడు. గరిష్టంగా మల్టిప్లెక్స్ లో 295 అదే రిక్లైనర్ అయితే ఏకంగా 350 పెట్టారు. దీంతో చాలా మంది అంత రేటు పెట్టి టికెట్ కొనాలంటే ఆలోచిస్తున్నారు.

Ajay Devgn : ఖైదీ రీమేక్‌తో భోళా యూనివర్స్ క్రియేట్ చేస్తానంటున్న అజయ్ దేవగన్..

సినిమాకు ఎక్కువ ఖర్చు అవ్వడం, సినిమాపై హైప్ పెంచడంతో జనాల్లో ఆసక్తి ఉండటంతో టికెట్ రేటు పెంచితే వచ్చేస్తారనుకుంటున్నారు. కానీ గతంలో ఇదే చాలా సినిమాలకు మైనస్ అయింది. ఒకవేళ నాని దసరాకి ఓపెనింగ్స్ వచ్చినా ఇదే రేటు వీకెండ్ దాటిన తర్వాత కూడా ఉంటే మాత్రం కష్టమే. నాని టాప్ హీరోల్లో ఒకడైనా స్టార్ హీరో, బాక్సాఫీస్ కలెక్షన్స్ హీరో మాత్రం కాదు అలాంటిది దసరా సినిమాకి 300 పెట్టి చూడాలంటే చాలా మంది కచ్చితంగా ఆలోచిస్తారు. నాని సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నా ఈ విషయంలో మాత్రం తప్పు చేశాడు అంటున్నారు. చూడాలి మరి నాని ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తాడో ఈ టికెట్ రేట్లతో.