Raja Vikramarka: కార్తికేయకి అండగా నాని.. ట్రైలర్ ముహూర్తం ఫిక్స్!

తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక హీరో సినిమా ఫంక్షన్ కు మరో హీరో గెస్ట్ గా రావడం.. సినిమా ప్రమోట్ చేయడం చాలా కాలంగా..

Raja Vikramarka: తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక హీరో సినిమా ఫంక్షన్ కు మరో హీరో గెస్ట్ గా రావడం.. సినిమా ప్రమోట్ చేయడం చాలా కాలంగా చూస్తున్నదే. అయితే ఈ మధ్య ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. ఇప్పటికే చాలా మంది హీరోలు.. ముఖ్యంగా స్టార్ హీరోలు యంగ్ హీరోల సినిమాల వేడుకలకు హాజరై వారికి అండగా నిలుస్తున్నారు.

Ritika Singh : రితిక సింగ్ గ్లామరస్ పిక్స్

న్యాచులర్ స్టార్ నానీ ఇప్పుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయకు అండగా ఉంటున్నాడు. కార్తికేయ హీరోగా సాయి శ్రీపల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ‘రాజా విక్రమార్క’. మంచి అంచనాలే పెట్టుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ కట్ ని రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 1న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని చేతుల మీదగా విడుదల కానుంది.

Kajal Aggarwal : కాజల్ కుర్రాళ్ల మనసులు ముక్కలు చేసి ఏడాది..

సాయంత్రం 11:15 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇది వరకే ఈ ఇద్దరు హీరోలు కూడా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరి నాని రిలీజ్ చేసే ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన తన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండగా 88రామా రెడ్డి నిర్మాణం వహించారు.

ట్రెండింగ్ వార్తలు