Dasara: ఊరమాస్ నానీ.. కెవ్వు కేక ‘స్పార్క్ ఆఫ్ దసరా’ గ్లిమ్ప్స్!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Dasara: ఊరమాస్ నానీ.. కెవ్వు కేక ‘స్పార్క్ ఆఫ్ దసరా’ గ్లిమ్ప్స్!

Dasara

Dasara: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘అంటే.. సుందరానికీ!’ సినిమా షూటింగ్‌ కూడా పూర్తి చేశాడు. లేట్ చేయకుండా ‘దసరా’ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాడు. గత సంవత్సరం దసరా రోజు ‘దసరా’ సినిమా అనౌన్స్ చేయడంతోనే ఇది కొత్తగా ఉండబోతుందని చెప్పేశారు.

Dasara : నాని ‘దసరా’ కోసం 12 కోట్లతో భారీ సెట్

నాని కెరీర్‌లో 29వ చిత్రంగా రాబోతున్న దసరా చిత్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిగా నేచురల్ స్టార్ కనిపిస్తున్నాడు. తెలంగాణ గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ కథ సాగుతుందని సమాచారం. ఈ సారి నాని మరింత పూర్తి మాస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. శ్రీకాంత్‌ ఓదెల అనే కొత్త దర్శకుడు సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Nani: మార్చిలో ‘దసరా’.. ముహూర్తం పెట్టిన నాని!

కాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ సమయంలో ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా దసరా చిత్ర యూనిట్ ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చేసింది. శనివారం ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఇక చెప్పినట్లుగానే ఆదివారం నాని చేస్తున్న మాస్ రోల్ ని ధరణిగా పరిచయం చేస్తూ క్రేజీ మాస్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

Nani 29: కొత్తగా నానీ క్యారెక్టర్.. క్రూరుడిగా కనిపించనున్న నేచురల్ స్టార్!

ఇక, గ్లిమ్ప్స్ విషయానికి వస్తే నానీ కెరీర్ లో ఇదో మరో కొత్త క్యారెక్టర్ కానుందని చెప్పుకోవచ్చు. ఓ మైనింగ్ ఏరియాలో ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ అనంతరం మరో యాక్షన్ సీన్ కోసం బయల్దేరినట్టు కనిపిస్తున్న నాని కొత్త లుక్ లో అదరగొట్టాడని చెప్పాలి. కోలీవుడ్ సాలిడ్ మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్ లో ఎఫెక్టివ్ గా ఉంది. ఎస్ఎల్వి సినిమాస్ నిర్మిస్తున్న దసరా సినిమాని తెలుగు, ఇతర దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ చేశారు.