Nani: న్యూ ఇయర్ రోజున నాని కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Nani: న్యూ ఇయర్ రోజున నాని కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

Nani Milestone 30th Movie To Be Announced On January 1st

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Nani: ‘దసరా’ ముగింపుకు ఫిక్స్ అయిన నాని.. ఇక ఆగేదే లేదట!

కాగా, నాని కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రాబోతున్న 30వ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా అనౌన్స్ చేయబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించి ఓ అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తన తొలి ప్రొడక్షన్‌గా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను జనవరి 1న సాయంత్రం 4.05 గంటలకు చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

Nani : ‘హిట్’ వర్స్ లో సినిమాలు వస్తూనే ఉంటాయి.. హిట్ 7లో ఏడుగురు హీరోలు ఉంటారు..

ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నాని ఎలాంటి పాత్రలో నటిస్తాడా, హీరోయిన్ ఎవరు ఉంటారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి నాని కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రాబోతున్న 30వ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.