Nani: ‘ఎంత చిత్రం’ అంటూ లీల భుజంపై వాలిపోయిన సుందరం!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘‘అంటే సుందరానికీ..’’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ...

Nani: ‘ఎంత చిత్రం’ అంటూ లీల భుజంపై వాలిపోయిన సుందరం!

Nani Nazriya Ante Sundaraniki Entha Chithram Lyrical Song Update

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘‘అంటే సుందరానికీ..’’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘పంచె కట్టు’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, చిత్ర యూనిట్ ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.

Ante Sundaraniki : ట్విట్టర్ వేదికగా కన్నడ ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన నాని

‘ఎంత చిత్రం’ అంటూ సాగే ఈ రెండో లిరికల్ సాంగ్‌ను మే 9న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దడంతో క్లాస్ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్ కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని, నజ్రియాతో ఆయన చేసే కొంటె పనులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Ante Sundaraniki: అంటే సుందరానికీ.. పక్కా కామెడీ గురూ!

నాని, నజ్రియా లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం బలంగా మారనుంది. ఈ సినిమాకు నికేష్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 10న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి అంటే సుందరానికీ నుండి రాబోతున్న ‘ఎంత చిత్రం’ సాంగ్ ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.