Dasara Teaser: దసరా టీజర్.. రస్టిక్ కాదు.. అంతకు మించిపోయిన నాని!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘దసరా’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నాని పూర్తి తెలంగాణ యాసలో రెచ్చిపోయి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో నాని కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

Dasara Teaser: దసరా టీజర్.. రస్టిక్ కాదు.. అంతకు మించిపోయిన నాని!

Dasara Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘దసరా’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నాని పూర్తి తెలంగాణ యాసలో రెచ్చిపోయి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో నాని కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర వీడియో గ్లింప్స్‌లు, సాంగ్ ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

Dasara Movie : నాని దసరా రెండు భాగాలుగా రాబోతోందా?

తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పూర్తి రా అండ్ రస్టిక్‌గా ఈ టీజర్ కట్ ఉండటంతో ఈ సినిమాతో నాని మాస్ కాదు.. ఊరమాస్ బ్లాక్‌బస్టర్‌ను పట్టుకొస్తున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. టీజర్‌లో నాని చెప్పే డైలాగులు మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. ‘‘మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం..’’ అంటూ నాని చెప్పే డైలాగ్ ఊరమాస్‌గా చూపెట్టారు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుండటంతో సినిమాలోని మెజారిటీ షాట్స్ మనకు వాటి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలవిగా చూపెట్టారు. ఇక నాని ఈ సినిమా కోసం చేసిన మేకోవర్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉండనుండగా, ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లే విధంగా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఉంది.

Dasara Movie: నాని ‘దసరా’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే..?

ఇక టీజర్ చివరల్లో నాని నోట్లో కత్తి పెట్టుకుని వేలితో రక్తపు సింధూరం పెట్టుకోవడంతో ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా మనకు శాంపిల్ చూపెట్టారని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి కుమార్, షైన్ టామ్ చాకో, సముథ్రఖని, జరీనా వాహబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, మార్చి 30న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.