Nani : మాస్ మూవీకి విజుల్స్ వేసేది విమర్శించిన ఆ నలుగురు దర్శకులే.. కేజీఎఫ్ కాంట్రవర్సీ పై నాని రియాక్షన్!

ఇటీవల టాలీవుడ్ లో కమర్షియల్ మూవీ పై డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం లేపాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా రియాక్ట్ అయ్యాడు.

Nani : మాస్ మూవీకి విజుల్స్ వేసేది విమర్శించిన ఆ నలుగురు దర్శకులే.. కేజీఎఫ్ కాంట్రవర్సీ పై నాని రియాక్షన్!

Nani : ఇటీవల టాలీవుడ్ లో కమర్షియల్ మూవీ పై కాంట్రవర్సీ మొదలైన సంగతి తెలిసిందే. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కమర్షియల్ మూవీస్ అండ్ డైరెక్టర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మంచి సినిమాలు చేసే మాకన్నా, ఒక నిచ్ కమీన్ గాడిని హీరోగా చూపించే దర్శకులకు ఎక్కువ మార్కులు వేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీని పై ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగింది. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ విషయం పై ఇటీవల స్పందించాడు.

Venkatesh Maha : కేజీఎఫ్ వివాదం పై స్పందించిన కంచరపాలెం దర్శకుడు..

తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నాని, పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో విలేకరి.. ఇటీవల కమర్షియల్ సినిమాలు గురించి వెంకటేష్ మహా కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ దర్శకులు కూడా ఆ కామెంట్స్ అంగీకరించారు. ఆ మద్దతు తెలిపిన నలుగురు దర్శకులు మీతో సినిమాలు చేసిన వారే. ఈ కాంట్రవర్సీ పై మీ కామెంట్స్ ఏంటని? ప్రశ్నించాడు.

Harish Shankar : కేజీఎఫ్ పై కంచరపాలెం దర్శకుడు వ్యాఖ్యలు.. హరీష్ శంకర్ చురకలు!

నాని బదులిస్తూ.. ”మనం సినిమా చూసి వచ్చాక ఫ్రెండ్స్ దగ్గర ఒకలా మాట్లాడతాం. అదే మీడియా ముందుకు వచ్చాకా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాం. ఆ కాంట్రవర్సీలో ఆ జాగ్రత్త మిస్ అయ్యింది అనుకుంటున్నా. వాళ్లంతా ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతూ, అది వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. వారి మాటలు ఎలా ఉన్నా సరే, నేను ఆ ఒక్క మాట పట్టుకొని వాళ్ళని తప్పుబట్టను. ఎందుకంటే అక్కడ ఉన్న నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ మాస్ సినిమాలు చూసి విజుల్స్ వేయడం నేను చాలాసార్లు చూశాను. నా ముందే కేజీఎఫ్ గురించి మాట్లాడుతూ.. ఏమి ఎడిటింగ్ చేశాడు అంటూ పొగిడారు” అంటూ చెప్పుకొచ్చాడు.