Nani : ఓ దర్శకుడు నన్ను సెట్ లో అందరిముందు అవమానించాడు..

ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కెరీర్ ఆరంభంలో తనకి జరిగిన అవమానం గురించి మాట్లాడాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా, మొదట్లో కష్టంగా అనిపించిందా అని యాంకర్ అడగగా నాని సమాధానమిస్తూ..

Nani : ఓ దర్శకుడు నన్ను సెట్ లో అందరిముందు అవమానించాడు..

Nani Remembering his career starting days in Dasara Promotions

Nani :  న్యాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం దసరా(Dasara) సినిమాతో రాబోతున్నాడు. మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. మొదటి సారి నాని పూర్తి మాస్ లుక్ లో కనపడుతుండటం, ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ అదరగొట్టేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని. దసరా సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండటంతో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు నాని.

తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని కెరీర్ ఆరంభంలో తనకి జరిగిన అవమానం గురించి మాట్లాడాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా, మొదట్లో కష్టంగా అనిపించిందా అని యాంకర్ అడగగా నాని సమాధానమిస్తూ.. కష్టంగానే అనిపిస్తుంది. మొదట్లో అసలు ఇక్కడ ఏం జరుగుతుందని మనకి అర్ధం కాదు. మనకి ఇక్కడ ఎవరూ సాయం చేయరు.

నేర్చుకునే సమయంలో చాలా ఇబ్బందులు పడొచ్చు కానీ ఆ తర్వాత సక్సెస్ వస్తే ఇంకోలా ఉంటుంది. నేను కూడా కెరీర్ మొదట్లో చాలా కష్టపడ్డా, చాలా మంది తిట్టారు, రిజెక్ట్ చేశారు.. చాలా జరిగాయి. నా లాగే అవమానాలు ఎదుర్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నేను కొంచెం తక్కువే అనుకుంటున్నా. నా కంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డవాళ్ళు కూడా నాకు తెలుసు అని అన్నారు.

Akshay Kumar : షూటింగ్ లో గాయపడ్డ అక్షయ్ కుమార్.. ఆగిపోయిన సినిమా షూట్..

అలాగే.. మనం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండి అందులోను క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఎవరైనా నీకు ఏమైనా చెప్పేయొచ్చు అనుకుంటారు. మనల్ని ఇష్టం వచ్చిన మాటలు అంటారు. మన మీద అధికారం చెలాయించొచ్చు అనుకుంటారు. అప్పుడు నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. క్లాప్ బోర్డు రావడం ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవాళ్ళు. చాలా మాటలు పడ్డాను. వాటికి నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఓ డైరెక్టర్ నన్ను సెట్ లో అందరి ముందు అవమానించాడు. చాలా మాటలు అన్నాడు, నేను ఎప్పటికి సక్సెస్ కాలేనని, డైరెక్టర్ అవ్వలేనని విమర్శించాడు.

ఆ మాటలు నన్ను బాగా బాధపెట్టాయి. అలాంటి చాలా విమర్శలు ఎదుర్కొనే ఈ స్థాయికి వచ్చాను. నేను హీరో అయ్యాక మంచి పొజిషన్ లో ఉన్నాక ఆ డైరెక్టర్ ని కలిశాను అప్పుడు కూడా మాధ్య మంచి వాతావరణం లేదు అని అన్నారు నాని. కానీ ఆ డైరెక్టర్ మాత్రం ఎవరో చెప్పలేదు.