Dasara Movie: ‘దసరా’పై మహేష్ కామెంట్స్.. సాలిడ్ రిప్లై ఇచ్చిన నాని!
దసరా సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేశాడు. మహేష్ కామెంట్స్‌కు నాని తనదైన రిప్లై ఇచ్చాడు.

Nani Reply To Mahesh Babu On Dasara Movie Goes Viral
Dasara Movie: నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ తాజాగా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను పూర్తి రా అండ్ రస్టిక్‌గా చిత్ర యూనిట్ మలిచిన తీరు థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ వచ్చేలా చేస్తోంది. ఈ సినిమాలో డీగ్లామర్ పాత్రల్లో నటీనటులు చేసిన పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Dasara : జెర్సీ మూమెంట్ అంటున్న నాని.. దసరా సక్సెస్ మాములుగా లేదు..
కాగా, దసరా సినిమాపై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దసరా సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేశాడు. దసరా ఒక స్టన్నింగ్ సినిమా అని.. ఈ సినిమాను చూసి గర్వపడుతున్నానంటూ కామెంట్ చేశాడు. దసరా చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. ఇక సూపర్ స్టార్ నుండి ఇలాంటి కామెంట్స్ రావడంతో నాని అండ్ టీమ్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. తాజాగా మహేష్ కామెంట్స్‌కు నాని తనదైన రిప్లై ఇచ్చాడు.
Dasara Collections : నాని కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్.. అదరగొట్టిన దసరా కలెక్షన్స్..
మహేష్ నుండి ఇలాంటి కామెంట్స్ రావడం.. పోకిరి సినిమాకు మణిశర్మ సంగీతం లాగా ఉందని నాని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం నాని ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ మహేష్ దసరా సినిమాపై చేసిన కామెంట్స్, దానికి నాని రిప్లైని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. దసరా సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.
Thank you @urstrulyMahesh sir. Your voice of support for good cinema is what Manisharma’s score is for pokiri 🙏🏼♥️ https://t.co/mHxrCsZ1gb
— Nani (@NameisNani) March 31, 2023