Nani: ‘దసరా’ నా మనసుకు చాలా దగ్గరయిన మూవీ – నాని

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి రా అండ్ రస్టిక్ కథతో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించింది దసరా టీమ్.

Nani: ‘దసరా’ నా మనసుకు చాలా దగ్గరయిన మూవీ – నాని

Nani Says Dasara Movie Is Close To His Heart

Nani: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, పూర్తి మాస్ నేపథ్యంలో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో నాని ఇప్పటివరకు కనిపించని ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా వస్తుండటంతో నాని అండ్ టీమ్ ఈ మూవీ సక్సెస్‌పై భారీ నమ్మకాలు పెట్టుకున్నారు.

Nani : ఓ దర్శకుడు నన్ను సెట్ లో అందరిముందు అవమానించాడు..

పూర్తి రా అండ్ రస్టిక్ కథతో ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌లో నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించింది దసరా టీమ్. ఈ సందర్భంగా హీరో నాని దసరా సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

దసరా మూవీ తన మనసుకు చాలా దగ్గరయిన సినిమా అని నాని చెప్పుకొచ్చాడు. మాస్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఇలాంటి ప్రాజెక్టును తనకు అందించిన నిర్మాత సుధాకర్ చెరుకూరికి థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు నాని. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయని.. ఈ సినిమా ప్రభావం కొన్నేళ పాటు ఉండిపోతుందని నాని తెలిపాడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని, ఇలాంటి పాత్రను డిజైన్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మున్ముందు మరిన్ని విజయాలను అందుకుంటాడని నాని అన్నాడు.

Nani : మాస్ మూవీకి విజుల్స్ వేసేది విమర్శించిన ఆ నలుగురు దర్శకులే.. కేజీఎఫ్ కాంట్రవర్సీ పై నాని రియాక్షన్!

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని.. సంతోష్ నారాయణన్ సాంగ్స్ ఇప్పటికే దుమ్ములేపుతున్నాయని.. థియేటర్లలో ఆడియెన్స్ ధూంధాం చేయడం ఖాయమని ఆయన అన్నాడు. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.