Dasara : ఆ సీన్ నన్ను చాలా భయపెట్టింది.. రెండు నెలలు చాలా ఇబ్బంది పడ్డాను.. నాని!

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కలయికలో వస్తున్న తాజా చిత్రం 'దసరా'. ఇక సినిమా విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టాడు నాని. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీలోని ఒక సన్నివేశం తనని ఎంతగా బాధపెట్టిందో చెప్పుకొచ్చాడు.

Dasara : ఆ సీన్ నన్ను చాలా భయపెట్టింది.. రెండు నెలలు చాలా ఇబ్బంది పడ్డాను.. నాని!

Dasara : నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ సినిమాతో నాని మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. 90’s కాలంలో సింగరేణి బొగ్గు గనులు నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. డైరెక్టర్ సుకుమార్ దగ్గర వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. కంప్లీట్ రా అండ్ రస్టిక్ కథతో వస్తున్న ఈ చిత్రంలో నాని రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు.

Dasara Trailer Released : పురాణాలను మించిన బ్రతుకులా మనవి.. మాస్ మూలవిరాట్‌గా దర్శనం ఇవ్వబోతున్న నాని..

ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా నాని ఈ సినిమాలో చూడబోతున్నాము అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ మూవీ కోసం నాని చాలా కష్ట పడ్డాడు. ఇక సినిమా విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టాడు నాని. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీలోని ఒక సన్నివేశం తనని ఎంతగా బాధపెట్టిందో చెప్పుకొచ్చాడు. ఆ సీన్ ఏంటంటే.. బొగ్గు తీసుకోని వెళ్తున్న డంపర్ ట్రక్ లో నాని కూడా ఉంటాడు. ఒక చోటుకి వెళ్ళాక, ఆ ట్రక్ బొగ్గుని డంప్ చేయడంతో.. నాని కింద పడి, తన పై బొగ్గు పడుతుంది.

ఆ సన్నివేశం కోసం సింథటిక్ బొగ్గు రెడీ చేశారట. సింథటిక్ బొగ్గుతో పాటు ట్రక్ లో కొంచెం డస్ట్ కూడా నింపారు. ఇక తన పై బొగ్గు పడి సీన్ కంప్లీట్ అయ్యి, సెట్ బాయ్స్ వచ్చి తనని బొగ్గు నుంచి బయటకి తిసేవరకు గాలి పీల్చుకోకుండా ఉండాలి. ఒకవేళ గాలి పిలిస్తే, ఆ డస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎలాగైతే ఆ సీన్ పూర్తి చేశారట. కానీ ఆ సీన్ తనని రెండు నెలలు పాటు వెంటాడిందని వెల్లడించాడు నాని. కింద పడడం, బొగ్గు తన పై పడడం, పైకి లాగడం పదే పదే గుర్తుకు వచ్చి ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చాడు.