Ante Sundaraniki : ట్విట్టర్ వేదికగా కన్నడ ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన నాని

నాని మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు కూడా తెలుగులో చూస్తారు. అందుకే కన్నడలో మా మూవీని డబ్ చేయడం లేదు. ఎందుకంటే చాలా మంది కన్నడ ప్రజలు...............

Ante Sundaraniki :  ట్విట్టర్ వేదికగా కన్నడ ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన నాని

Nani

 

Nani :  న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అంటే సుందరానికి’. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీనికి సంబంధించిన టీజర్ ని ఇటీవల విడుదల చేశారు. దీనికి సంబంధించి టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా ఈ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ కన్నడ ప్రజలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

 

‘అంటే సుందరానికి’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని చేసిన వ్యాఖ్యలు వివాదానికి తావిచ్చాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు, మలయాళం, తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈవెంట్ లో ఓ రిపోర్టర్ కన్నడలో రిలీజ్ చేయట్లేదా అని అడగగా దానికి సమాధానంగా నాని మాట్లాడుతూ.. ”ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు కూడా తెలుగులో చూస్తారు. అందుకే కన్నడలో మా మూవీని డబ్ చేయడం లేదు. ఎందుకంటే చాలా మంది కన్నడ ప్రజలు తెలుగు అర్థం చేసుకుంటారు. వారు తెలుగు చిత్రాలను తెలుగులోనే చూసేందుకు ఇష్టపడతారు. కన్నడలో చాలా మంది తెలుగు తెలిసిన వారున్నారు. అందుకే అక్కడ తెలుగులోనే సినిమా రిలీజ్ అవుతుంది. కానీ మిగతా వాళ్లకు మాత్రం వాళ్ళ భాషల్లో సినిమాను విడుదల చేస్తేనే అర్థమౌవుతుంది” అని అన్నారు.

Maruthi : టాలీవుడ్‌లో విషాదం.. స్టార్ డైరెక్టర్ తండ్రి మృతి..

అయితే నాని చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కన్నడ ప్రేక్షకులు వీటిని వ్యతిరేకిస్తున్నారు. నాని వ్యాఖ్యలని తప్పుపడుతూ కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా నానిని విమర్శిస్తున్నారు. మాకు తెలుగు రాదు, తెలుగు అర్ధం కాదు. కన్నడలో సినిమా రిలీజ్ చేస్తే చేయండి లేకపోతే చేయొద్దు. తెలుగులో రిలీజ్ చేస్తే మేము సినిమా చూడము, మీ సినిమా చూడాలంటే కన్నడ లో కూడా డబ్ చేయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో నానిని ట్యాగ్ చేసి కన్నడ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఈ అంశం విపరీతంగా వైరల్ అయింది. కన్నడ ప్రజలు నాని చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Prabhas : ప్రశాంత్ నీల్ సూపర్ ప్లాన్.. ‘సలార్’కి కూడా ఆ యంగ్ ఎడిటర్??

 

దీంతో ఈ వ్యాఖ్యలకి నాని స్పందించారు. ట్విట్టర్లో ఈ వ్యాఖ్యలకి నాని స్పందిస్తూ.. ”కన్నడ డబ్బింగ్ వర్షన్ అందుబాటులో లేని టైంలో కూడా నా సినిమాలు, వేరే తెలుగు సినిమాలని మన కన్నడ కుటుంబం ఆదరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్‌మీట్‌లో నేను చేసిన ఈ వ్యాఖ్యలకి ఒక రకమైన అర్ధం ఉంటే సోషల్ మీడియాలో మాత్రం దాని అర్దాన్ని మార్చేశారు. నా అభిప్రాయాన్ని సరిగ్గా చెప్పలేకపోతే క్షమించండి. ఇటీవల హద్దులు దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్‌కు గర్వపడుతున్నా” అంటూ ట్వీట్స్ చేశారు. మరి ఈ క్షమాపణలతో కన్నడ ప్రేక్షకులు శాంతిస్తారా? లేక సినిమాని కన్నడలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారా చూడాలి.