Nani : 25 ఏళ్ళ పాటు నన్ను గుర్తుపెట్టుకుంటారు.. నాని!

నేచురల్ స్టార్ నాని నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు. కాగా నిన్న హైదరాబాద్‌లో నాని ఫ్యాన్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఫ్యాన్స్‌తో పాటు నాని కూడా హాజరయ్యాడు. ఇక వచ్చిన వారందరికి కమ్మని విందు కూడా ఏర్పాటు చేశాడు నాని. అంతేకాదు దసరా మూవీ గెటప్‌లోనే ఒక్కొక్కరితో విడివిడిగా ఫోటో దిగి అభిమానులను ఖుషి చేశాడు. కాగా ఆ ఫోటోలు దిగే ముందు నాని మాట్లాడుతూ..

Nani : 25 ఏళ్ళ పాటు నన్ను గుర్తుపెట్టుకుంటారు.. నాని!

nani says u will be remember me for 25 years

Nani : నేచురల్ స్టార్ నాని నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు. వాల్ పోస్టర్ సినిమాస్ అంటూ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ‘హిట్’ వంటి క్రైమ్ యూనివర్స్‌తో అదిరిపోయే సక్సెస్‌ని అందుకున్నాడు. ఇక ఇటీవలే తన 30వ సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా నిన్న హైదరాబాద్‌లో నాని ఫ్యాన్స్ మీట్ జరిగింది.

Nani 30 : మరోసారి తండ్రి పాత్రలో నాని.. ఆకట్టుకుంటున్న నాని30 గ్లింప్స్!

ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఫ్యాన్స్‌తో పాటు నాని కూడా హాజరయ్యాడు. ఇక వచ్చిన వారందరికి కమ్మని విందు కూడా ఏర్పాటు చేశాడు నాని. అంతేకాదు దసరా మూవీ గెటప్‌లోనే ఒక్కొక్కరితో విడివిడిగా ఫోటో దిగి అభిమానులను ఖుషి చేశాడు. కాగా ఆ ఫోటోలు దిగే ముందు నాని మాట్లాడుతూ.. “దసరా సినిమా చూసేటప్పుడు, ఒక సీన్ లో మీరంతా పిచ్చెక్కిపోయి విజుల్స్ వేసే సన్నివేశంలో నేను ఇదే డ్రెస్‌లో ఉంటా. సినిమాలో మీకు గుర్తుండిపోయే ఎపిసోడ్, 25 ఏళ్ళ పాటు నన్ను గుర్తుపెట్టుకునేలా చేసిన ఎపిసోడ్‌లో కూడా నేను ఇదే డ్రెస్‌లో ఉన్నా” అంటూ, ఆ గెటప్‌లోనే ఇప్పుడు మీకు ఫోటోలు ఇస్తున్న అనే ఉదేశంతో నాని మాట్లాడాడు.

దసరా సినిమా కథ మొత్తం 90 కాలంలో సింగరేణి బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో జరగనుంది. ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనుండగా, హీరోయిన్ గా కీర్తిసురేష్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్ అండ్ టీజర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. శ్రీకాంత ఒడ్డెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తుంది.