Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలు సక్సెస్ కాకపోయినా, ఆడియన్స్ రెస్పాన్స్ అంత బాగా లేకపోయినా.. నాని మాత్రం ఓటీటీకి హాట్ ఫేవరెట్ అయిపోయాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా, రిజల్ట్ ని..

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

Shyam Singha Roy

Shyam Singha Roy: ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలు సక్సెస్ కాకపోయినా, ఆడియన్స్ రెస్పాన్స్ అంత బాగా లేకపోయినా.. నాని మాత్రం ఓటీటీకి హాట్ ఫేవరెట్ అయిపోయాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా, రిజల్ట్ ని ఏమాత్రం పట్టించుకోకుండా.. నాని జై అంటున్నాయి ఓటీటీలు. అలాంటిది విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాను ఓటీటీలు వదిలిపెడతాయా? ఆల్రెడీ రెండు సినిమాల్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసిన నాని.. ఇప్పుడు రిలీజై సక్సెస్ టాక్ తెచ్చుకున్న మూడో సినిమాకి కూడా బాగానే రాబట్టుకుంటున్నట్లు తెలుస్తుంది.

Salman Khan: భాయ్‌జాన్ బిజీబిజీ.. ఒకవైపు సోలో సినిమాలు మరోవైపు మల్టీస్టారర్‌లు!

నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సంకృత్యాన్ కలకత్తా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన మూవీ హిట్‌టాక్ తెచ్చుకోగా కమర్షియల్‌గా కూడా మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది. కాగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలపై క్రేజీ టాక్ ఒకటి నడుస్తుంది.

Nani-Thaman: మ్యూజిక్‌పై నానీ కామెంట్స్.. తమన్ కౌంటర్ ట్వీట్స్?

నిజానికి శ్యామ్‌ సింగరాయ్‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చినా థియేటర్లోనే విడుదల చేశారు. ఈ విషయాన్ని నానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా చెప్పాడు. కాగా, అనుకున్నట్లుగానే థియేటర్లో రిలీజ్‌ అయి సక్సెస్ కొట్టిన ఈమూవీని ఇప్పుడు భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్ట్రీమింగ్‌ కానుందంటూ ప్రచారం సాగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.