Shyam Singha Roy : గుమ్మడికాయ కొట్టబోతున్న నాని..

‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో నేచుర‌ల్‌ స్టార్ నాని నటిస్తున్న సినిమా.. ‘శ్యామ్‌ సింగ‌ రాయ్’..

Shyam Singha Roy : గుమ్మడికాయ కొట్టబోతున్న నాని..

Nani Shyam Singha Roy Movie Final Schedule Starts

Shyam Singha Roy: ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో నేచుర‌ల్‌ స్టార్ నాని నటిస్తున్న సినిమా.. ‘శ్యామ్‌ సింగ‌ రాయ్’.. ఇటీవ‌లి కాలంలో ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఈ మూవీ కూడా ఒక‌టి. నాని, సాయిప‌ల్ల‌విల ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియ‌ెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చే విధంగా ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.

ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సార‌థ్యంలో ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో 10ఎక‌రాల స్థ‌లంలో నిర్మించిన భారీ కోల్‌క‌తా సెట్ హైద‌రాబాద్‌లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా దెబ్బ‌తింది. ఆ సెట్‌ను పున‌ర్నిర్మించి ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ు తెర‌కెక్కిస్తున్నారు. నాని స‌హా మెయిన్ లీడింగ్ ఆర్టిస్టులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా మేకర్స్ విడుద‌ల చేసిన పోస్టర్‌లో నాని లుక్ ఆక‌ట్టుకుంటుంది.

Sai Pallavi

సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం, జీస్సూసేన్‌ గుప్తా, లీలా శ్యామ్‌స‌న్‌, మ‌ణీశ్ వ‌డ్వ‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ, మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. శాను జాన్ వ‌ర్గీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నవీన్‌ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.