Shyam Singha Roy : నాని సినిమా టీజర్ ఎప్పుడంటే..

నేచురల్‌ స్టార్‌ నాని ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ మూవీ టీజర్ అప్‌డేట్..

Shyam Singha Roy : నాని సినిమా టీజర్ ఎప్పుడంటే..

Shyam Singha Roy

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్‌ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో, వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

Shyam Singha Roy : నాలుగు భాషల్లో నాని సినిమా

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమాలో నాని చేస్తున్న వాసు క్యారెక్టర్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుండడం.. ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి.

Shyam Singha Roy

 

Naatu Naatu Song : నాటు కొట్టుడు రికార్డులు!

గురువారం కొత్త అప్‌డేట్ ఇచ్చింది టీం. నవంబర్ 18న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 24 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.