Shyam Singha Roy : నాని గుమ్మడికాయ కొట్టేశాడు..

వెండితెరపై ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు గ్రాఫిక్స్‌ టీమ్‌ శక్తివంచన లేకుండా హై ఎండ్ టెక్నాల‌జీతో పని చేస్తున్నారు..

Shyam Singha Roy : నాని గుమ్మడికాయ కొట్టేశాడు..

Shyam Singha Roy

Shyam Singha Roy: కోవిడ్‌ సెకండ్‌ వేవ్, భారీ ఈదురు గాలులు, వర్షాలు ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సెట్స్‌ను నాశనం చేయగలిగాయి కానీ షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ కాకుండా ఆపలేకపోయాయి. అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొని న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ షూటింగ్‌ విజయవంతంగా పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను శరవేగంగా జరుపుతున్నామని చిత్రయూనిట్‌ సగర్వంగా తెలిపింది. వెండితెరపై ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు గ్రాఫిక్స్‌ టీమ్‌ శక్తివంచన లేకుండా హై ఎండ్ టెక్నాల‌జీతో పని చేస్తున్నారు. దీంతో ‘శ్యామ్‌సింగరాయ్‌’ కథ, కథనాల పరంగానే కాదు.. విజువల్‌ పరంగా కూడా అత్యద్భుతంగా ఉండబోతుంది.

‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం ఎంతో స్పెషల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డారు. స్పెషల్‌ మేకోవర్‌లో కనిపిస్తారు. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రం నుంచి విడుదలైన నాని, సాయిపల్లవి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఒక యూనిక్‌ స్టోరీతో తెలుగు ఆడియన్స్‌కి ఒక కొత్త‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే విధంగా దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Shyam SinghaRoy : ఆరున్న‌ర కోట్ల‌తో హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో నాని శ్యామ్ సింగ‌రాయ్’ ఫైన‌ల్ షెడ్యూల్..

ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో బడ్జెట్‌ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించారు. ‘‘శ్యామ్‌ సింగరాయ్‌’ షూటింగ్‌ పూర్తయ్యింది. ఔట్‌పుట్‌ పట్ల నేను మా టీమ్‌ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. మేం అనుకున్న సమయంలో షూటింగ్‌ పూర్తిచేయడానికి పూర్తి సహాకారం అందించిన యూనిట్‌‌కి కృతజ్ఞతలు’’ అని నిర్మాత వెంకట్‌ బోయనపల్లి అన్నారు.

పశ్చిమబెంగాల్‌లో నాని ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ లాంగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. బెంగాల్‌ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతంగా వేసిన టెంపుల్‌ సెట్‌లో కొన్ని ప్రధానమైన, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ముగ్గురు బ్యూటిఫుల్‌ హీరోయిన్స్‌ సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ ఈ చిత్రంలో నటించారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రలు పోషించారు.

Nani, Chaitu – Vijay : ఒక ప్రాపర్ కమర్షియల్ బొమ్మ కనుక పడితే..

ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు అసోసియేటైయ్యారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. శాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రాఫర్‌గా, నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.