Dasara: క్లైమాక్స్‌ను షురూ చేసిన నాని..నాన్‌స్టాప్‌గా ముగించేస్తాడట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ చాలా రోజుల నుంచి షూటింగ్ జరపుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్‌తో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నాని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ‘దసరా’ చిత్ర చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించారు.

Dasara: క్లైమాక్స్‌ను షురూ చేసిన నాని..నాన్‌స్టాప్‌గా ముగించేస్తాడట!

Nani Starts Last Schedule Of Dasara Shooting

Dasara: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ చాలా రోజుల నుంచి షూటింగ్ జరపుకుంటోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్‌తో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నాని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ‘దసరా’ చిత్ర చివరి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించారు.

Nani Dasara Movie:దసరాలో వెన్నెల చిందులు.. కీర్తి సురేష్‌కి నాని బర్త్ డే గిఫ్ట్..

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా ఇంట్రొడ్యూస్ అవుతూ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ సింగరేణి గనుల నేపథ్యంలో రాబోతుంది. ఈ సినిమాలో నాని లుక్ పూర్తి రఫ్‌గా ఉండబోతుంది. తెలంగాణ యాసలో సాగే ఈ సినిమాలో నాని పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు సబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేసినట్లుగా నాని తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Nani Dasara Movie: రిలీజ్‭కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసిన నాని సినిమా!

ఈ షెడ్యూల్ సినిమాకు అత్యంత కీలకమైనదని.. ఇది సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని నాని తెలిపాడు. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ తరువాత ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె కూడా ఈ సినిమాలో డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.