Nani: దసరా కోసం కోత.. తప్పదంటున్న నాని..? | Nani To Reduce Remuneration For Dasara

Nani: దసరా కోసం కోత.. తప్పదంటున్న నాని..?

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన.....

Nani: దసరా కోసం కోత.. తప్పదంటున్న నాని..?

Nani: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకు టాక్ పరంగా మంచి రెస్పాన్స్ దక్కినా, కమర్షియల్‌గా మాత్రం చాలా డల్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌కు రాలేకపోతుందని చిత్ర విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ సినిమాతో నాని వరుసగా ఫ్లాపుల పరంపరను కొనసాగిస్తున్నాడనే ముద్ర పడింది.

Nani: అంటే సుందరానికీ.. అంత అవసరమా..?

గతకొంత కాలంగా నాని లెవెల్‌కు తగ్గ బ్లాక్‌బస్టర్ బొమ్మ పడలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ ప్రభావం తన నెక్ట్స్ మూవీపై పడబోతున్నట్లుగా తెలుస్తోంది. నాని ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘దసరా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా షూటింగ్ కొంతమేర జరుపుకున్నాక, ఇప్పుడు ఈ షూటింగ్ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.

Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?

దర్శకుడు, చిత్ర నిర్మాతల మధ్య మనస్పర్థలు రావడంతోనే ఈ సినిమా ఆగిందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే బడ్జెట్ విషయంలో చిత్ర నిర్మాతలు హ్యాపీగా లేరని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం నాని తన రెమ్యునరేషన్‌కు కోత పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు అరడజన్ సినిమాలను ఫ్లాపులుగా మిగిల్చిన నాని, ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటాడో ఇప్పుడే గ్యారెంటీగా చెప్పలేమని చిత్ర యూనిట్ అనడంతో.. నాని ఈ నిర్ణయం తీసుకున్నాడట. దసరా సినిమా కంటెంట్ పరంగా అత్యద్భుతంగా ఉండటంతోనే ఆయన ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట. మరి ఈ సినిమా కంటిన్యూ చేసేది లేనిది మరికొన్ని రోజుల్లో నాని తేల్చిచెప్పనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

×