Dasara : సుకుమార్ పై నాని చేసిన కామెంట్స్ వైరల్..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో నాని అండ్ టీం ప్రమోషన్స్ భాగంగా ఆయా భాషల్లో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వగా..

Dasara : సుకుమార్ పై నాని చేసిన కామెంట్స్ వైరల్..

nani viral comments on director sukumar at dasara promotions

Dasara : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. నేను లోకల్ సినిమా తరువాత కీర్తి సురేష్ మరోసారి నానికి జంటగా నటిస్తుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని రా అండ్ రస్టిక్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఒక క్లూ ఇచ్చేశాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీంతో నాని అండ్ టీం ప్రమోషన్స్ భాగంగా ఆయా భాషల్లో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు.

Dasara Movie: నాని సినిమాకు అక్కడ ఫుల్ డిమాండ్.. కెరీర్‌లోనే రికార్డు బిజినెస్!

ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పై నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో విలేకరి.. పాన్‌ ఇండియాకు వెళ్ళే వారు ప్రూవ్డ్ దర్శకులు ద్వారా వెళ్ళారు. కానీ మీరు కొత్త దర్శకుడితో వెళుతున్నారు. మీ అంచనా ఏంటి అని ప్రశ్నించాడు. దీనికి నాని బదులిస్తూ.. ”పుష్ప 5 భాషల్లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా తీసిన సుకుమార్ గారు తెలుగులో మాత్రమే తెలుసు, మిగిలిన 4 భాషల్లో తెలియదు కదా. అయితే మా దర్శకుడు 5 భాషల్లో తెలియదు అంతే తేడా. నాకు శ్రీకాంత్‌ పై పూర్తి నమ్మకముంది” అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Dasara : ఆ సీన్ నన్ను చాలా భయపెట్టింది.. రెండు నెలలు చాలా ఇబ్బంది పడ్డాను.. నాని!

ఇక ఈ సినిమా పై నాని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అవార్డులు, రివార్డ్ లు వస్తాయి అంటూ ముందు గానే చెప్పుకొస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నానికి ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.