Nani vs Akhil: క్రిస్టమస్ సాక్షిగా.. అఖిల్ నానీల సినీ ఫైట్!

నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్న నాని.. తన్ అప్ కమింగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. దసరా కి టక్ జగదీష్ రిలీజ్ చేసిన నాని క్రిస్టమస్ పండక్కి కొత్త సినిమా రిలీజ్ చెయ్యబోతున్నాడు

Nani vs Akhil: క్రిస్టమస్ సాక్షిగా.. అఖిల్ నానీల సినీ ఫైట్!

Nani Vs Akhil

Nani vs Akhil: నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తున్న నాని.. తన్ అప్ కమింగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. దసరా కి టక్ జగదీష్ రిలీజ్ చేసిన నాని క్రిస్టమస్ పండక్కి కొత్త సినిమా రిలీజ్ చెయ్యబోతున్నాడు. అయితే అదే రోజు ఆల్రెడీ ఖర్చీఫ్ వేసుకున్న అఖిల్.. ఏజెంట్ గా ఆడియన్స్ ముందుకు వస్తాడా..? లేక మనసుమార్చుకుని వెనక్కి వెళ్తారా ..? అన్నది తేలాల్సి ఉంది.

Ketika Sharma: అందం అమ్మాయైతే కేతికలా ఉంటుందేమో!

వరుస పెట్టి సినిమాలు చేస్తున్న నాని.. మరో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. రాహుల్ సంస్కృత్యన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమాని డిసెంబర్ 24న క్రిస్టమస్ సీజన్ లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు నాని. నాని కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా శ్యామ్ సింగరాయ్.

Jr NTR: ఎక్స్‌పెరిమెంట్స్ జోలికెళ్లని తారక్.. పక్కా సేఫ్ గేమ్!

సాయిపల్లవి, కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లు గా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ ని నాని డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే డిసెంబర్ 24నే అఖిల్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టు టీమ్ అఫీషియల్ గా ఎప్పుడో అనౌన్స్ చేసింది. అఖిల్ మూవీ డిసెంబర్ 24న రిలీజ్ అవుతుంటే..నాని కూడా అదే రోజు సినిమా రిలీజ్ అనౌన్స్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

#FliporFoldchallenge: సామ్‌సంగ్ కోసం యోహాని ఫ్లిప్ ఆర్ ఫోల్డ్ ఛాలెంజ్!

రెండేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న నాని.. మెగా హీరో రిలీజ్ డేట్ ని ఎందుకు ఆక్యుపై చేస్తాడంటూ ఓ వైపు చర్చ జరుగుతుంటే.. ఏజెంట్ సమ్మర్ కి జంప్ అయ్యాడు. అందుకే నాని క్రిస్ మస్ కి వస్తున్నాడు అంటూ మరో టాక్ నడుస్తోంది. లవర్ బాయ్ గా ఉన్న అఖిల్ ఏజెంట్ గా కొత్త అవతారం ఎత్తితే.. కెరీర్ లో ఇప్పటి వరకూ లుక్ వైజ్ ఎప్పుడూ చెయ్యని ప్రయోగాలు చేసి శ్యామ్ సింగరాయ్ గా కనిపించబోతున్నారు నాని.