Shyam Singha Roy: ఫ్యాన్స్‌తో నానీ.. శ్యామ్ కోసం సరికొత్త ప్రమోషన్!

నేచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ నానీ సినిమాలో ..

Shyam Singha Roy: ఫ్యాన్స్‌తో నానీ.. శ్యామ్ కోసం సరికొత్త ప్రమోషన్!

Shyam Singha Roy

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ నానీ సినిమాలో తొలిసారి ముగ్గురు కథానాయికలు. కలకత్తా బ్యాక్ డ్రాప్.. ఇంతకు ముందెన్నడూ చూడని నానీ గెటప్. ఇలా ఎన్నో ప్రత్యేకతలు శ్యామ్ సింగరాయ్ సొంతం. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ తో సినిమా మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

Kamal Haasan : కమల్ హాసన్‌కు కరోనా..

రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ ఇలా ఉండబోతుంది అంటూ ఇప్పటికే విశ్లేషకుల టాక్స్ కూడా మొదలవడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని నానీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంతగా నానీ ఈ సినిమా కోసం సొంత ప్రమోషన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా నానీ స్వయంగా అభిమానులతో ఇంటరాక్ట్ కాబోతున్నాడు.

Bigg Boss 5: జెస్సీ హెల్త్ ప్రాబ్లమ్ ఎలిమినేషన్.. స్క్రిప్ట్ ప్రకారమే చేశారా?

తన అభిమానులను కలిసేందుకు సిద్దమైన నాని ఫ్యాన్స్ మీట్ అంటూ నవంబర్ 28వ తేదీన హైదరాబాద్ లో ఒక కార్యక్రమం నిర్వహించనున్నాడు. ఇప్పటికే ఈ ఫ్యాన్స్ మీట్ కు సంబంధిచిన పోస్టర్లు కూడా విడుదల చేయగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకొనే అభిమానులు పోస్టర్లలోని నంబర్ లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోండగా అభిమానుల నుండి భారీ స్పందన వస్తుంది.