అమెజాన్ ప్రైమ్‌పై అభిమానులు ఆగ్రహం: నెట్లో నానీ’స్ గ్యాంగ్ లీడర్ 4k పైరసీ

  • Published By: vamsi ,Published On : October 12, 2019 / 03:00 AM IST
అమెజాన్ ప్రైమ్‌పై అభిమానులు ఆగ్రహం: నెట్లో నానీ’స్ గ్యాంగ్ లీడర్ 4k పైరసీ

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్​ఫామ్స్ వచ్చాక సినిమా విడుదలైన నెలరోజుల్లోనే నెట్టింట్లో సూపర్ క్వాలీటీతో సినిమాలు ప్రత్యక్షం అయిపోతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని టాప్​ ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో ఒకటిగా కొనసాగుతున్న అమెజాన్ ప్రైమ్ తెలుగు సినిమాలను చాలావరకు తీసుకుని విడుదల చేస్తుంది.

అయితే లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కి విడుదలైన గ్యాంగ్ లీడర్’ సినిమాను నెట్టింట్లో విడుదల చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా హిట్టు టాక్ తెచ్చుకుని ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే ‘అమెజాన్ ప్రైమ్’ లోకి వచ్చేసింది.

నిబంధనల ప్రకారమైతే ఏ సినిమా అయినా ఫలితంతో సంబంధం లేకుండా కనీసం 2నెలలు గడిస్తేనే డిజిటల్ ఫ్లాట్ ఫాం లోకి వెళ్లాలి. అయితే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, అమెజాన్ మధ్య ఎటువంటి అగ్రిమెంట్ జరిగిందో తెలియదు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైపోయింది. అయితే సినిమా విడుదలై నెలకాకముందే సినిమాను అమెజాన్‌లో పెట్టడంతో అభిమానులు సీరియస్ అయ్యారు. ట్విట్టర్‌లో అమెజాన్‌కు అక్షింతలు వేశారు.

దీంతో తప్పును సరిచేసుకునేందుకు సినిమాను తొలగించింది. అయితే ఈలోపు చేయాల్సిన డ్యామెజ్ చేసేశారు పైరసీదారులు. అమెజాన్ ప్రైమ్‌లో పెట్టిన కొద్దిసేపటికే సినిమాను పైరసీ రాయుళ్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ‘గ్యాంగ్ లీడర్’ ను పైరసీ చేసి తమ వెబ్ సైట్‌లలో పెట్టేశారు. తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలో ఓవైపు ఆడుతుంటే 4కే రెజోల్యూషన్ తో ఆన్లైన్‌లో సినిమా వచ్చేలా అమెజాన్ ప్రైమ్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.