హ్యాట్సాఫ్! చిరంజీవి గారు : సైరా సూపర్ – నారా లోకేష్

  • Published By: madhu ,Published On : October 4, 2019 / 02:00 PM IST
హ్యాట్సాఫ్! చిరంజీవి గారు : సైరా సూపర్ – నారా లోకేష్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. చిత్రం బాగుందంటూ కితాబిచ్చారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియచేశారు. ఈ మేరకు లోకేష్..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు కీలక నటులు నటించిన సినిమా సైరా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 02వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై సినీ, రాజకీయ ఇతర రంగాలకు చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిరు నటన అదరహో అంటున్నారు.. లోకేష్ కూడా సినిమా చూసిన అనంతరం ఆయన స్పందన వ్యక్తం చేశారు. 

ఎంతో పరిశ్రమించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి  విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, చిత్ర దర్శకులు, సాంకేతిక సిబ్బంది.. యూనిట్ మొత్తానికీ హార్దికాభినందనలు తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా ‘సైరా’. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు. అంటూ ట్వీట్ చేశారు. 

Read More : సైరా టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
ఇక చిత్ర విషయానికి వస్తే..చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తర్వాత 151వ సినిమాగా సైరా తెరకెక్కింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ చిత్ర ఆధారంగా సినిమాను రూపొందించారు. కొణిదెల ప్రాడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మాతగా..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది సైరా. విడుదలైన అనంతరం అభిమానులను అలరిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడిగా చిరు నటన, హావభావాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని కితాబిచ్చారు పలువురు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, తమన్నా సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, రవి కిషన్, నిహారిక, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు నటించారు.