నరకాసురుడు-ఫస్ట్‌లుక్

నరకాసురుడు-ఫస్ట్‌లుక్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : February 15, 2019 / 10:02 AM IST
నరకాసురుడు-ఫస్ట్‌లుక్

నరకాసురుడు-ఫస్ట్‌లుక్ రిలీజ్.

అరవింద్ స్వామి, శ్రియ, సందీప్ కిషన్ మెయిన్ లీడ్స్‌గా, రమేష్ వర్మ పెన్మెత్స ప్రొడక్షన్‌లో, కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నసినిమా.. ‘నరకాసురుడు’.. కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా నరకాసురుడు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ‘ది టేల్ ఆఫ్ ఎ ఫాలెన్ డెమాన్’.. అనేది ట్యాగ్ లైన్.. ఈ ఫస్ట్‌లుక్‌లో అరవింద్ స్వామి ఎక్స్‌ప్రెషన్ బాధగా, శ్రియ రియాక్షన్ కోపంగా చూస్తున్నట్టు ఉంది..

క్రైమ్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న నరకాసురుడు గతేడాది మే లోనే రిలీజ్ కావాల్సి ఉండగా, పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ‘నేలకొరిగిన ఓ రాక్షసుడి కథ అనే క్యాప్షన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ఈ సమ్మర్‌లో, తెలుగు, తమిళ్‌లో నరకాసురుడు రిలీజ్ కానుంది.