R Narayanamurthy : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే ‘బంగార్రాజు’ సక్సెస్ అయింది

ఆర్ నారాయణ మూర్తి ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''సినిమాని కాపాడాలని సంక్రాంతికి లాక్ డౌన్, కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షోలకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక....

R Narayanamurthy : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే ‘బంగార్రాజు’ సక్సెస్ అయింది

Banagarraju

R Narayanamurthy :  ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడంతో నాగార్జున ధైర్యం చేసి తన ‘బంగార్రాజు’ సినిమాని రిలీజ్ చేశాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది. అప్పుడే 50 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. తాజాగా నిన్న సాయంత్రం ఈ సినిమా సక్సెస్ మీట్ ని రాజమండ్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిధిగా వచ్చారు.

Sreeja : భర్త పేరు తీసేసిన చిరంజీవి కూతురు.. సమంతని ఫాలో అవుతుందా??

ఆర్ నారాయణ మూర్తి ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”సినిమాని కాపాడాలని సంక్రాంతికి లాక్ డౌన్, కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షోలకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. సంక్రాంతి పండగంటే దేవుడి పండుగ, కోడి పందాల పండుగ, సినిమా పండగ. సినిమాని కాపాడాలని ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. అన్ని షోలు బ్రహ్మండంగా ఆడించుకోండి అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఈ రోజు ‘బంగార్రాజు’ నాలుగు రోజులకే 50 కోట్ల క్లబ్ లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ విజయం సాధ్యమైంది” అని తెలిపారు.