Malli Pelli : నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ మూవీ మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

నరేష్ - పవిత్రల మళ్ళీ పెళ్లి మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మరి మొదటిరోజు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Malli Pelli : నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ మూవీ మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Naresh Pavithra Lokesh Malli Pelli movie collections

Naresh Malli Pelli : టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ నరేశ్, పవిత్ర లోకేష్ (Pavithra Lokesh) పెళ్లి చేసుకున్న తరువాత మెయిన్ లీడ్ లో కలిసి నటించిన సినిమా ‘మళ్ళీ పెళ్లి’. వీరిద్దరి పరిచయం, పెళ్లి విషయాలనే సినిమా కథకు తీసుకోని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. MS రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిన్న (మే 26) ఆడియన్స్ ముందుకు వచ్చింది. నరేష్ – పవిత్రల పెళ్లి అనంతరం ఈ సినిమా వస్తుండడం, స్టోరీ కూడా నిజ జీవితాలు నుంచి తీసుకోవడంతో.. మూవీ వార్తల్లో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

Salman Khan : నిన్న బాడీగార్డ్స్ నెట్టడం.. నేడు సల్మాన్ కౌగిలించుకోవడం.. విక్కీ కౌశల్‌ వీడియో వైరల్!

నరేష్ అండ్ పవిత్ర కూడా టీవీ షోల్లో సందడి చేస్తూ మూవీని ప్రమోట్ చేస్తూ వచ్చారు. మరి థియేటర్ వద్ద ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూదాం. సినిమాలోని కామెడీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక నరేష్ యాక్టింగ్ సినిమాకి ప్లస్ అంటున్నారు. మొత్తానికి సినిమాని ఒకసారి చూడవచ్చు అని చెబుతున్నారు. ఇక ఫస్ట్ డే ఈ మూవీ 30 లక్షల వరకు కలెక్ట్ చేసింది. ట్రేడ్ వర్గాలు ప్రకారం ఇది గుడ్ స్టార్ట్ అంటున్నారు. మరి మొదటి వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Salman Khan : ఇక తన లైఫ్‌లో పెళ్లి చాప్టర్ లేదని చెప్పేసిన సల్మాన్.. వీడియో వైరల్!

కాగా ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, వనిత విజయ్ కుమార్, జయసుధ, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలు చేశారు. ఇటీవల కన్నుమూసిన శరత్ కుమార్ (Sarath Kumar) ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీనే ఆయన నటించిన చివరి చిత్రం. ఈ సినిమాని నరేష్ తన సొంత బ్యానర్ విజయ్ కృష్ణ సంస్థలో నిర్మించాడు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.