Malli Pelli : మళ్ళీ పెళ్లి ట్రైలర్ చూశారా? నరేష్ – పవిత్ర జీవిత కథలానే ఉంది..

తాజాగా మళ్ళీ పెళ్లి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఇది కచ్చితంగా నరేష్ - పవిత్రాల బయోపిక్ అని అర్థమైపోతుంది.

Malli Pelli : మళ్ళీ పెళ్లి ట్రైలర్ చూశారా? నరేష్ – పవిత్ర జీవిత కథలానే ఉంది..

Naresh Pavitra Malli Pelli Movie Trailer Released

Malli Pelli : గత కొన్నాళ్లుగా టాలీవుడ్(Tollywood) లో బాగా వైరల్ అయిన జంట సీనియర్ నటుడు నరేష్(Naresh) – నటి పవిత్ర లోకేష్(Pavithra Lokesh). ఓ సినిమాలో కలిసి నటించిన వీరు బయట కూడా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో బాగా వైరల్ అయ్యారు. అనంతరం నరేష్ తన మూడో భార్యతో గొడవలు పడటం, ఇవి రోడ్డుకెక్కడం, పవిత్ర-నరేష్ కలిసి ఓ హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో, వార్తల్లో బాగా ట్రెండ్ అయింది.

నరేష్-పవిత్ర లోకేష్ పై పలు వార్తలు, గాసిప్స్ వచ్చినా మొదట స్పందించకపోయినా 2023 న్యూ ఇయర్ సందర్భంగా అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి, ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి, లిప్ కిస్ ఇచ్చుకున్న ఓ వీడియోని షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా ప్రకటించి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.

అనంతరం మళ్ళీ పెళ్లి సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూశాక మరోసారి అంతా ఆశ్చర్యపోయారు. నరేష్ లైఫ్ లో జరిగిందే ఈ టీజర్ లో చూపించడంతో ఇది నరేష్ – పవిత్రల కథే అని అనుకున్నారు అంతా. తాజాగా మళ్ళీ పెళ్లి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఇది కచ్చితంగా నరేష్ – పవిత్రాల బయోపిక్ అని అర్థమైపోతుంది. ట్రైలర్ లో నరేష్ – పవిత్ర ఎలా క్లోజ్ అయ్యారు, మూడో భార్య చేసిన రచ్చ ఏంటి?, ఇద్దరు కలిసి తిరగడం, గాసిప్స్.. ఇవన్నీ చూపించారు. దీంతో మళ్ళీ పెళ్లి ట్రైలర్ వైరల్ గా మారింది.

Malli Pelli: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మళ్లీ పెళ్లి’.. ఆడియెన్స్ వస్తారా మళ్లీ మళ్లీ..?

నరేష్ – పవిత్రల రియల్ స్టోరీనే సినిమాగా తీస్తున్నారని తెలియడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. ఈ మళ్ళీ పెళ్లి సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత MS రాజు తెరకెక్కిస్తుండగా నరేష్ సొంతంగా నిర్మిస్తున్నారు. మళ్ళీ పెళ్లి సినిమా మే 26న తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.