Ramya : నరేష్-పవిత్రల పెళ్లి జరగనివ్వను.. విడాకులు ఇవ్వను.. నరేష్ మూడో భార్య రమ్య సంచలన వ్యాఖ్యలు..

రమ్య మాట్లాడుతూ.. నరేష్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఆయనతో పెళ్ళికి ఒప్పుకోకపోయినా ఒప్పించాను. కానీ పెళ్లి అయ్యాక నరేష్ గురించి నాకు చాలా విషయాలు తెలిశాయి. ఆయనకి వేరేవాళ్లతో సంబంధాలున్నాయి. నాకు చాలా సార్లు.........

Ramya : నరేష్-పవిత్రల పెళ్లి జరగనివ్వను.. విడాకులు ఇవ్వను.. నరేష్ మూడో భార్య రమ్య సంచలన వ్యాఖ్యలు..

Naresh Third wife Ramya comments on Naresh and Pavitra marriage

Ramya :  గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రలు వార్తల్లో, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. వారిపై అనేక గాసిప్స్ వచ్చాయి. ఇటీవల త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి నరేష్, పవిత్ర లిప్ కిస్ పెట్టుకుంటున్న ఓ వీడియోని రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు.

ఇక నరేష్ కి మూడో భార్య రమ్యతో గతంలో గొడవలు ఉన్నాయి. వీరిద్దరి గొడవలు కూడా వార్తల్లో నిలిచాయి. విడాకులు తీసుకుంటామని నరేష్ గతంలో ప్రకటించాడు. అలాగే ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలిపాడు. ఆమెతో విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి రమ్యకి కూడా షాక్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

Rajamouli : సినిమా నాకు దేవాలయం లాంటిది.. చిన్నప్పుడు సినిమా ఇచ్చిన ఆనందం ఇప్పటికి గుర్తుంది..

రమ్య మాట్లాడుతూ.. నరేష్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఆయనతో పెళ్ళికి ఒప్పుకోకపోయినా ఒప్పించాను. కానీ పెళ్లి అయ్యాక నరేష్ గురించి నాకు చాలా విషయాలు తెలిశాయి. ఆయనకి వేరేవాళ్లతో సంబంధాలున్నాయి. నాకు చాలా సార్లు ఆ విషయంలో క్షమాపణలు చెప్పాడు. నేను సర్దుకొని, ఆయన మారతాడని అనుకుంటున్నాను. సమ్మోహనం సినిమా అప్పుడు నరేష్, పవిత్ర క్లోజ్ అయ్యారు. మా ఇంటికి కూడా తీసుకువచ్చి నాకు పరిచయం చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మీద నాకు అనుమానం వచ్చింది. ఇటీవల వాళ్ళు షేర్ చేసిన వీడియో చూసి నాకు చాలా బాధగా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టడానికి వీళ్ళిద్దరూ చాలా పనులు చేశారు. నాకు పదేళ్ల కొడుకు ఉన్నాడు. వాడు నాన్నతో విడిపోవద్దు అంటున్నాడు. ప్రస్తుతం మా విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి విడాకులు ఇవ్వను, వాళ్ళిద్దర్నీ పెళ్లి చేసుకోనివ్వను అని తెలిపింది. మరోసారి రమ్య ఈ వ్యాఖ్యలతో వైరల్ గా మారింది. మరి దీనికి నరేష్ ఏమన్నా సమాధానం చెప్తాడేమో చూడాలి.