Pawan Kalyan : పవన్‌కళ్యాణ్ కోసం.. జాక్వెలిన్ అవుట్.. నర్గిస్ ఇన్..

క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' షూటింగ్ జనవరిలో ప్రారంభమవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాలో పెద్ద చేంజ్ జరిగిందని.............

Pawan Kalyan : పవన్‌కళ్యాణ్ కోసం.. జాక్వెలిన్ అవుట్.. నర్గిస్ ఇన్..

Hari Hara

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలతో మరో పక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలకి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలని అనౌన్స్ చేశారు పవర్ స్టార్. ఇక మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉండటంతో రెండేళ్లలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి తర్వాత రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడు పవన్. దీంతో వరుసగా సినిమా షూటింగ్స్ చేస్తున్నాడు.

Balakrishna : ANRని ఇమిటేట్ చేసిన బాలయ్య.. ఆహా అంటున్న ఫ్యాన్స్

ఇప్పటికే పవన్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండి. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జనవరిలో ప్రారంభమవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాలో పెద్ద చేంజ్ జరిగిందని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నిధితో పాటు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో మహారాణి పాత్రలో నటించేందుకు జాక్వెలిన్ ఓకే చెప్పింది.

Thaman : బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన తమన్

అయితే ప్రస్తుతం ఆమెకున్న సమస్యలు, డేట్స్ ఇష్యూ వల్ల జాక్వెలిన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో షూట్ ఆగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో షూట్ మొదలు పెట్టాలని డైరెక్టర్ క్రిష్ ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇప్పుడు జాక్వెలిన్ ప్లేస్ లో మరో బాలీవుడ్ భామని తీసుకొచ్చారు. దర్శకుడు క్రిష్ జాక్వెలిన్ ప్లేస్ లో మరో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రిని తీసుకున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో దాదాపు 15 సినిమాల్లో నటించిన ఈ ఇండో అమెరికన్ బ్యూటీ ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో పవన్ సరసన టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.