Balakrishna : బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సూపర్ ఛాన్స్ ఇచ్చిన బాలయ్య బాబు

బిగ్ బాస్ ముందు నటరాజ్ మాస్టర్ కెరీర్ డల్ గా ఉంది. ఈ షోతో కొంచెం పాపులారిటీ తెచ్చుకున్నారు నటరాజ్ మాస్టర్. దీంతో బయటకి వచ్చాక ఆఫర్స్ బాగానే వస్తాయి అని అనుకున్నారు. అనుకున్నట్టే

Balakrishna : బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సూపర్ ఛాన్స్ ఇచ్చిన బాలయ్య బాబు

Nbk

Balakrishna :  బాలయ్య బాబు సినిమాల్లో హీరోగానే కాక త్వరలో యాంకర్ గా కూడా మారి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాడు. నందమూరి బాలకృష్ణ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ షోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇండస్ట్రీలోని కొన్ని ఫ్యామిలీలని ఈ షోలో ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ షో కోసం బాలయ్య బాబు స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కొరియోగ్రాఫర్ గా ఇటీవల బయటకి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఇచ్చారని సమాచారం.

F3 Movie : మహా శివరాత్రికి నవ్వించడానికి వస్తున్న ‘ఎఫ్ 3’

బిగ్ బాస్ షో వల్ల చాలా మందికి మంచి కెరీర్ ఏర్పడుతుంది. షో నుంచి బయటకి వచ్చాక ఆఫర్స్ కూడా బాగానే వస్తాయి. ఆ షో ఇచ్చిన ఫేమ్ తో బాగానే సంపాదించుకుంటారు కంటెస్టెంట్స్. బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ నుంచి నాలుగో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యారు నటరాజ్ మాస్టర్. బిగ్ బాస్ ముందు నటరాజ్ మాస్టర్ కెరీర్ డల్ గా ఉంది. ఈ షోతో కొంచెం పాపులారిటీ తెచ్చుకున్నారు నటరాజ్ మాస్టర్. దీంతో బయటకి వచ్చాక ఆఫర్స్ బాగానే వస్తాయి అని అనుకున్నారు. అనుకున్నట్టే నటరాజ్ మాస్టర్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. ఆహాలో రాబోతున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో బాలకృష్ణ స్పెషల్ పర్ఫార్మెన్స్ కోసం నటరాజ్ మాస్టర్ ని కొరియోగ్రాఫర్ గా సెలెక్ట్ చేశారు. దీంతో నటరాజ్ మాస్టర్ కి బిగ్ బాస్ బాగానే ప్లస్ అయింది అని వినిపిస్తుంది. ఇటీవల నటరాజ్ మాస్టర్ బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటో బయటకు రావడంతో ఆ ఫోటో కూడా వైరల్ అయింది.