Bigg Boss 5: నటరాజ్ అవుట్.. రొమాన్స్‌లో మునిగి తేలిన పింకీ, విశ్వ
బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ అవగా.. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి ఎలిమినేట్ కాగా నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ను కూడా హౌస్ నుండి..

Bigg Boss 5
Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ అవగా.. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి ఎలిమినేట్ కాగా నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ను కూడా హౌస్ నుండి బయటకి పంపేశారు. వీకెండ్ సరదాగా మార్చేందుకు హుషారుగా వచ్చిన హోస్ట్ నాగార్జునకు హౌస్‌మేట్స్ ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలోని పాటలకు స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇవ్వగా.. ఇంప్రెస్ అయిన నాగ్ తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చాడు.
Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో 8 మంది.. ఎలిమినేట్ అయ్యేది ఇతనే?
ఆ తర్వాత సండేను ఫండే చేసేందుకు ఇంటిసభ్యులను రెండు టీములుగా విడగొట్టిన నాగ్ శ్రీరామ్, నటరాజ్, యానీ, ప్రియ, మానస్, జెస్సీ, సిరి, రవి A టీమ్ కాగా మిగతావారు B టీమ్‌లో విడదీశారు. గేమ్‌లో భాగంగా ప్రతి టీమ్‌లోనుంచి ఒక్కొక్కరు బాక్స్‌లో నుంచి చీటీ తీయాలి. అందులో ఉన్న సినిమా పేరును హింట్ ఇస్తూ డ్రాయింగ్ వేయాలి. అది చూసి సదరు టీమ్ మెంబర్స్ సరైన ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తే డ్రాయింగ్ వేసిన కంటెస్టెంట్ వారికి నచ్చినవాళ్లతో డ్యాన్స్ చేయొచ్చు.
Big Boss 5: లంచ్‌కి సిరి.. డిన్నర్‌కి హమీదా.. శ్రీరామ్ రొమాంటిక్ స్టోరీ!
అలా ఈ టాస్క్ లో ప్రియాంక సింగ్ నరుడా ఓ నరుడా సాంగ్‌కు రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశారు. విశ్వ ప్రియాంక ఇద్దరు కూడా చాలా రొమాంటిక్ గా అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా ప్రియాంక విశ్వం షర్ట్ ను కూడా తీసేస్తే విశ్వ తన బాడీని చూపిస్తూ తనదైన శైలిలో హావభావాలను చూపించాడు. ఇక పాటలో ప్రియాంక విశ్వ ఇద్దరు కూడా మరింత లీనం అవుతూ కనిపించడంతో నాగార్జున కూడా ఓకే ఓకే అంటూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాక్కో దాక్కో మేక అనే టాస్క్ కూడా ఆడించిన నాగ్ తర్వాత సిరి సేవ్ అయినట్లు ప్రకటించడంతో సంతోషం పట్టలేకపోయిన షణ్ను ఆమెని ఎత్తుకుని తిప్పాడు.
Big Boss 5: దేవకన్యలా ఉన్నావన్న నాగ్.. కొత్తగా చెప్పమని పంచ్ ఇచ్చిన బ్యూటీ!
చివరగా లోబో, నటరాజ్ ఇద్దరే మిగలగా.. హార్ట్ బీట్ సౌండ్‌తో టెన్షన్ పెంచేసిన నాగ్ చివరికి నటరాజ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో లోబో, యానీ, హమీదా గుక్కపెట్టి ఏడ్చేశారు. కడసారి బిగ్‌బాస్ హౌస్‌ను కళ్లారా చూసుకున్న నటరాజ్ కన్నీళ్లతో హౌస్ నుండి బయటకొచ్చాడు. మాస్టర్ పది మందికి పెట్టేవాడే కానీ అతడు ఇక్కడ సరిగా అన్నం కూడా తినలేదని బాధపడ్డాడు సన్నీ. నిజాయితీగా, స్ట్రిక్ట్‌గా ఉండటమే ఆయన చేసిన తప్పా? అని పింకీ ఎమోషనల్ అయింది. అనంతరం స్టేజీ మీదకు వచ్చిన నటరాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.