NFDC : గవర్నమెంట్ సొంత ఓటీటీ స్టార్ట్ చేస్తుందా? NFDC ఓటీటీ త్వరలో?

ఇటీవల ఇండియాలో సినీ పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుంది. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తుంది. సినీ పరిశ్రమ బిజినెస్ కూడా పెరిగింది.

NFDC : గవర్నమెంట్ సొంత ఓటీటీ స్టార్ట్ చేస్తుందా? NFDC ఓటీటీ త్వరలో?

National Film Development Corporations wants to starts its own OTT

NFDC :  ఇండియాలో మంచి సినిమాలు ప్రోత్సహించాలని, సినిమాలకు(Cinema) సపోర్ట్ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం 1975లో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NFDC) స్థాపించింది. దీని ఆఫీస్ ముంబైలో ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ సంస్థ ఆధ్వర్యంలో కొన్ని సినిమాలు నిర్మించి రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సంస్థ నుంచి సపోర్ట్ చేస్తూ సినిమాలు రాలేదు. NFDC ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

మళ్ళీ ఇన్నాళ్లకు ఈ సంస్థ యాక్టివేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఇండియాలో సినీ పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుంది. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తుంది. సినీ పరిశ్రమ బిజినెస్ కూడా పెరిగింది. దీంతో NFDC సంస్థ మళ్ళీ డైరెక్ట్ గా రంగంలోకి దిగి మంచి కంటెంట్, చిన్న సినిమాలని నిర్మించాలనుకుంటుంది.

Sudigadu 2 : అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సుడిగాడు 2’.. అల్లరి నరేష్ బ్యాక్ టు కామెడీ?

తాజాగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి పలు ఓటీటీలాగే NFDC కూడా సొంత ఓటీటీ స్థాపించబోతోంది అని సమాచారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ ఓటీటీ నడిపించబడుతుంది. మంచి ట్యాలెంట్, మంచి కథలు ఉన్న యువ టెక్నీషియన్స్ ని ప్రోత్సహించాలని అనుకుంటుంది. ఇందుకోసం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేస్తుందని ప్రకటించినట్లు NFDC అధికారులు తెలుపుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఓటీటీ వచ్చినా ప్రైవేట్ ఓటీటీలకు పోటీపడగలదా అనేది చూడాలి. మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి ఉండాలి.