Natti Kumar : ఫ్యాన్స్‌ను పవన్ కంట్రోల్ చేయాలి – నట్టికుమార్

సినిమా ఇండస్ట్రీ అంటే ఆ అరుగురే కాదన్నారు నట్టి కుమార్. చిన్న నిర్మాతలను కూడా ప్రభుత్వాలతో చర్చలకు పిలవాలన్నారు.

Natti Kumar : ఫ్యాన్స్‌ను పవన్ కంట్రోల్ చేయాలి – నట్టికుమార్

Natti Kumar

Natti Kumar : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటి మీద దాడిని ఖండించారు సినీ నిర్మాత, చిన్న నిర్మాతల సంఘం నాయకుడు నట్టి కుమార్. ఎవరు మాట్లాడినా మధ్యలోకి ఫ్యామిలీస్ ను తీసుకొస్తున్నారని ఆయన ఫైరయ్యారు. ఫ్యాన్స్ కూడా తమ నాయకులకు పేరు తెచ్చుకునేలా ప్రవర్తించాలని సూచించారు. జనసేన తెలంగాణ నాయకుడు ఆంధ్ర- తెలంగాణ భేదం తీసుకొస్తున్నారని.. ఇది చాలా తప్పని అన్నారు.

Janasena vs Posani: పోసాని ఇంటిపై రాళ్ళ దాడితో మాకు సంబంధం లేదు -తెలంగాణ జనసేన

“పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్. పొలిటికల్ గా మాకు ఎటువంటి సంబంధం లేదు. కొందరు నిర్మాతలు పవన్ కి రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అందరితో చర్చించకముందే ఫిలిం చాంబర్ లేఖ విడుదల చేసింది. కేవలం ప్రెసిడెంట్ కార్యదర్శి మాత్రమే ఆ లెటర్ పంపించారు. ఫ్యాన్స్‌ను నేను ఒకటే అడుగుతున్నాను. మీ పవన్‌ను తప్పు పట్టిస్తున్న నిర్మాతలను నిలదీయండి. పోసాని ఇంటి మీద మీరు రాళ్లు వేసిన వాళ్లు నా ఇంటి మీద కూడా వేస్తారు. జనసేన నాయకులు ఫ్యాన్స్‌ను గానీ… పవన్ ను ఈ విషయంలో రిక్వెస్ట్ చెయ్యాలి. ఈ దాడులను ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి” అని కోరారు.

మంత్రి పేర్ని నానిని కలిసిన పెద్ద నిర్మాతలు చిన్న సినిమాల గురించి కూడా మాట్లాడాలని కోరారు నట్టి కుమార్. సినిమా ఫీల్డ్ లో రేట్లు పెంచాలా లేదా అనేది గవర్నమెంట్ ఇష్టమని చెప్పారు. అన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ తో పారదర్శకత వస్తుందన్నారు. అన్ లైన్ పోర్టల్స్ జనం నుంచి ఎక్కువ రేటు వసూలు చేస్తుంటే గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయో అర్థం కావడంలేదన్నారు.

Shivaji Ganeshan : శివాజీ గణేశన్ జయంతి.. గూగుల్ స్పెషల్ గిఫ్ట్..

సినిమా ఇండస్ట్రీ అంటే ఆ అరుగురే కాదన్నారు నట్టి కుమార్. చిన్న నిర్మాతలను కూడా ప్రభుత్వాలతో చర్చలకు పిలవాలన్నారు. చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ఫీడింగ్ చేస్తున్నాయన్నారు. పొలిటికల్ శత్రుత్వాలతో సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉండకూడదన్నారు నట్టి కుమార్.