Michael Pre Release Event : మైఖేల్ కోసం దసరా బుల్లోడు..

టాలీవుడ్ యువహీరో సందీప్ కిషన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'మైఖేల్'. ఈ మూవీ ఫిబ్రవరి 3న రిలీజ్ కి సిద్దమవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే జనవరి 31న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి..

Michael Pre Release Event : మైఖేల్ కోసం దసరా బుల్లోడు..

Michael Pre Release Event : టాలీవుడ్ యువహీరో సందీప్ కిషన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘మైఖేల్’. సౌత్ టూ నార్త్ అన్ని లాంగ్వేజ్స్ లో నటిస్తూ వస్తున్న ఈ తెలుగు హీరో తొలిసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇప్పటి వరకు లవ్ అండ్ ఎంటర్‌టైనింగ్ సినిమాలతో అలరించిన సందీప్ కిషన్ ఈసారి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో రాబోతున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ చేతులు మీదగా ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.

Michael Trailer : సందీప్ కిషన్ ‘మైఖేల్’ ట్రైలర్‌ని లాంచ్ చేసిన బాలయ్య.. మాములుగా లేదు!

ఈ మూవీ ఫిబ్రవరి 3న రిలీజ్ కి సిద్దమవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే జనవరి 31న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. కాగా ఈ మూవీ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే చెన్నై లో ఘనంగా జరిగింది.

ఇక ఈ సినిమాకి తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘నగరం’ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఆ స్నేహంతోనే ఇప్పుడు ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో భారీ తారాగాణమే పని చేస్తుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి, తెలుగు యువహీరో వరుణ్ సందేశ్ ఈ మూవీలో విలన్స్ గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్, శరత్ కుమార్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మజిలీ ఫేమ్ ‘దివ్యాంశ కౌషిక్’ సందీప్ కిషన్ కి జంటగా నటిస్తుంది.తమిళ దర్శకుడు రంజిత్ జేయకుడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.