Nani: ‘గే’ పాత్రలో నవ్వించనున్న నేచురల్ స్టార్?

సాధారణంగా మన తెలుగు సినిమా హీరోలంటే ఒక్కడే పదిమంది రౌడీలను చితక్కొట్టాలి. ఒకరికి ఇద్దరు హీరోయిన్స్ ముందు వాళ్ళ హీరోయిజం చూపించి వాళ్ళతో రొమాన్స్ చేసి డ్యూయెట్లు పాడి శభాష్..

Nani: ‘గే’ పాత్రలో నవ్వించనున్న నేచురల్ స్టార్?

Nani

Nani: సాధారణంగా మన తెలుగు సినిమా హీరోలంటే ఒక్కడే పదిమంది రౌడీలను చితక్కొట్టాలి. ఒకరికి ఇద్దరు హీరోయిన్స్ ముందు వాళ్ళ హీరోయిజం చూపించి వాళ్ళతో రొమాన్స్ చేసి డ్యూయెట్లు పాడి శభాష్ అనిపించాలి. మరి అలాంటి వాళ్ళతో కమెడియన్ చేయాల్సిన పాత్రలు, గే పాత్రలు చేయించడం అంటే అంత సులభం కాదు. నిజానికి ఇలాంటి కల్చర్ బాలీవుడ్ లో చాలాకాలంగానే ఉంది. అందుకే అక్కడ గోవిందా లాంటి వాళ్ళు అక్కడ స్టార్ హీరోలు కాగలిగారు. ఇక ఇప్పుడిప్పుడే మన ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కల్చర్ పెరుగుతుంది.

కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలకైనా తాము సిద్ధమేనని మన స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. ఇంతకు ముందు ‘మసాలా’ సినిమాలో రామ్, ‘నర్తనశాల’లో యంగ్ హీరో నాగశౌర్య గే పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో వాళ్ళు గే కాకపోయినా సినిమాలోనే ‘గే’గా నటించే పాత్ర చేశారు. కాగా, ఇప్పుడు నేచురల్ స్టార్ నానీ కూడా అదే విధంగా గే పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

నానీ ప్రస్తుతం రెండు సినిమాలు విడుదలకు సిద్దమవగా మూడవ సినిమా ‘అంటే సుందరానికీ’ కూడా షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ మధ్యనే మొదలైన ఈ సినిమాను ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నానీ ‘గే’గా నటించే యువకుడిగా కనిపించనున్నాడట. పాత్రలో భాగంగా కాసేపు అలా నటించేందుకు సిద్దమయ్యాడట. మరి ఎంతవరకు నిజమన్నది చూడాల్సి ఉంది.