జెర్సీకి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్

జెర్సీ చిత్రాన్ని చూసిన సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చింది..

  • Edited By: sekhar , April 16, 2019 / 09:41 AM IST
జెర్సీకి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్

జెర్సీ చిత్రాన్ని చూసిన సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది..

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా, మళ్ళీ రావా సినిమా‌తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ, జెర్సీ.. 1990 ల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని.. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జెర్సీ చిత్రాన్ని చూసిన సెన్సార్ టీమ్ ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది..

సినిమా చాలా ఎమోషనల్‌గా ఉందని, ఆడియన్స్‌ని తప్పకుండా ఆకట్టుకోవడమేకాక, నాని కెరీర్‌లో ఒక ఢిఫరెంట్ సినిమాగా మిగిలిపోతుందని సెన్సార్ సభ్యులు చెప్పారు. ఏప్రిల్ 19 న జెర్సీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సత్యరాజ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : అనిరుధ్, కెమెరా : సంజు జాన్ వర్గీస్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, లిరిక్స్ : కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్).
 వాచ్ ట్రైలర్…