జెర్సీ జూక్ బాక్స్ రిలీజ్

జెర్సీ ఆడియో సాంగ్స్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : April 17, 2019 / 06:22 AM IST
జెర్సీ జూక్ బాక్స్ రిలీజ్

జెర్సీ ఆడియో సాంగ్స్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా, మళ్ళీ రావా ఫేమ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా, జెర్సీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

రీసెంట్‌గా జెర్సీ ఆడియో సాంగ్స్‌ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన జెర్సీ ఆల్బమ్‌లో మొత్తం అయిదు పాటలున్నాయి.. అదేంటోగాని ఉన్నపాటుగా.. అంటూ సాగే బ్యూటిఫుల్ మెలోడితో ప్రారంభమైన జెర్సీ ఆల్బమ్‌లో.. స్పిరిట్ ఆఫ్ జెర్సీ, పదే పదే, ప్రపంచమే అలా, నీడ పడదనీ.. అంటూ సాగే మంచి పాటలున్నాయి. సాంగ్స్ అన్నీ కూడా అర్థవంతంగా, లిరిక్స్ ఎమోషనల్‌గా ఉన్నాయి..
Read Also : సూసైడ్‌కి ముందు : కంటతడి పెట్టిస్తున్న ప్రేమికుల సెల్ఫీ వీడియో

కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, అనిరుధ్, కాల భైరవ, దర్శన్ రవి, శక్తిశ్రీ గోపాలన్, బ్రోధా వి తదితరులు చాలా బాగా పాడారు.  ఏప్రిల్ 19 న జెర్సీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.  సత్యరాజ్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నఈ సినిమాకి కెమెరా : సంజు జాన్ వర్గీస్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, లిరిక్స్ : కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్), నిర్మాత : సూర్యదేవర నాగవంశీ.

జెర్సీ జూక్ బాక్స్..