Nani-Chiranjeevi : మెగాస్టార్‌తో కలిసి మీసం మెలేసిన నేచురల్ స్టార్.. Nani Chiranjeevi

Nani-Chiranjeevi : మెగాస్టార్‌తో కలిసి మీసం మెలేసిన నేచురల్ స్టార్..

మెగాస్టార్‌తో మీసం కలిసి మీసం మెలితిప్పుతూ నేచురల్ స్టార్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

Nani-Chiranjeevi : మెగాస్టార్‌తో కలిసి మీసం మెలేసిన నేచురల్ స్టార్..

Nani-Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి స్టైల్‌గా మీసం మెలేస్తే ఎలా ఉంటుంది?.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ వస్తుంది.. అదే మెగాస్టార్‌తో కలిసి నేచురల్ స్టార్ నాని కూడా మీసం మెలేస్తే?.. ఊహించుకోవడానికి బాగానే ఉంది కానీ ఇది జరిగేపనేనా? అనుకుంటున్నారా?..

Akhanda : 200 కోట్ల క్లబ్‌‌లో ‘అఖండ’!

ఎస్.. జరిగింది.. మెగాస్టార్‌తో కలిసి మీసం మెలితిప్పుతూ నేచురల్ స్టార్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరు తన కంటే వయసులో చిన్న యాక్టర్లతో ఎంత సరదాగా ఉంటారో.. వాళ్లు కలిసినప్పుడు వాళ్లతో ఎలా సందడి చేస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు.

Chiranjeevi : మెగా లైనప్.. ఏకంగా ఏడు సినిమాలు!

నెరిసిన గడ్డంతో చిరు లుక్ కిరాక్ ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక నాని ఎప్పటిలానే కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. చిరు ‘ఆచార్య’ ఏప్రిల్ 1న రిలీజ్ కానుండగా.. ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ సినిమాలు లైన్‌లో పెట్టారు. ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’ తో డీసెంట్ హిట్ అందుకున్న నాని.. ‘అంటే.. సుందరానికీ’.. ‘దసరా’ సినిమాలు చేస్తున్నాడు.

×