జెర్సీ లేటెస్ట్ అప్‌డేట్‌…

ఏప్రిల్‌ 19న, జెర్సీ.. ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Edited By: sekhar , February 9, 2019 / 09:57 AM IST
జెర్సీ లేటెస్ట్ అప్‌డేట్‌…

ఏప్రిల్‌ 19న, జెర్సీ.. ప్రేక్షకుల ముందుకు రానుంది.

నేచురల్ స్టార్ నాని, మళ్ళీ రావా ఫేమ్.. గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ, జెర్సీ.. పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న 
ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ హీరోయిన్స్.. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. జెర్సీ ఫస్ట్‌లుక్, టీజర్‌కీ చక్కటి స్పందన వస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్‌ని బట్టి, జెర్సీ విషాదాంతంగా ముగుస్తుందని తెలుస్తుంది. జెర్సీలో మొత్తం ఎనిమిది పాటలుంటాయట.. వాటిలో రెండు ఎమోషనల్ సాంగ్స్, రెండు డ్యూయెట్స్, నాలుగు బిట్ సాంగ్స్ అని తెలుస్తుంది.

అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్‌ 19న, జెర్సీ.. ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, లిరిక్స్ : కృష్ణకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్).

వాచ్ టీజర్…