Navdeep : నేను ‘గే’ కాదు.. నా వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు.. నవదీప్ సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం నవదీప్ న్యూసెన్స్ అనే సిరీస్ తో ఆహా ఓటీటీలో రాబోతున్నాడు. నవదీప్, బిందుమాధవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన టీజర్, ఓ సాంగ్ ప్రేక్షకులని మెప్పించాయి. ఈ న్యూసెన్స్ సిరీస్ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా నేడు న్యూసెన్స్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ జరిగింది.

Navdeep : నేను ‘గే’ కాదు.. నా వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు.. నవదీప్ సంచలన వ్యాఖ్యలు..

Navadeep sensational comments on rumors about him

Navdeep :  టాలీవుడ్(Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నవదీప్(Navdeep) కూడా ఒకరు. ఒకప్పుడు జై, గౌతమ్ SSC, చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా అచ్చేసిన నవదీప్ ఆ తర్వాత సెకండ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయాడు. నవదీప్ చివరిసారిగా 2021లో మోసగాళ్లు(Mosagallu) సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత ఎక్కువగా వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ పెట్టి వరుసగా పలు ఓటీటీలలో సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం నవదీప్ న్యూసెన్స్ అనే సిరీస్ తో ఆహా ఓటీటీలో రాబోతున్నాడు. నవదీప్, బిందుమాధవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన టీజర్, ఓ సాంగ్ ప్రేక్షకులని మెప్పించాయి. ఈ న్యూసెన్స్ సిరీస్ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా నేడు న్యూసెన్స్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో నవదీప్, బిందు మాధవి, చిత్రయూనిట్, ఆహా టీం పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో నవదీప్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Kangana Ranaut : ఈ సినిమా మీకు తప్పుగా అనిపిస్తే మీరు టెర్రరిస్ట్ లే.. ది కేరళ స్టోరీ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు..

గతంలో కొన్నేళ్ల క్రితం నవదీప్ గే అని, నవదీప్ వల్ల ఓ హీరోయిన్ చనిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా నవదీప్ వీటిపై స్పందించాడు. నవదీప్ మాట్లాడుతూ.. 2005లో నావల్ల ఒక హీరోయిన్ చనిపోయింది అని ఓ పత్రికలో వార్త వచ్చింది. అది పూర్తిగా అబద్ధం. నా వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు. అలాగే నేను గే అనే వార్తలు కూడా వచ్చాయి. నేను గే అనేది అబద్ధం. నేను రేవ్ పార్టీలో పాల్గొన్నాను అని ఓ పేపర్ లో వార్త వచ్చింది. అది కూడా అబద్దం. ఆ వార్త జరిగింది అని చెప్పిన సమయంలో నేను మా అమ్మతో ఫార్మ్ హౌస్ కి వెళ్ళాను. కానీ అది నా మంచికే జరిగింది. ఎందుకంటే ఇలాంటి కొన్ని ఫేక్ వార్తల వల్ల మా ఇంట్లో కూడా నన్ను నమ్మే పొజిషన్ లేకుండా పోయింది. కానీ మా అమ్మతో ఉన్నప్పుడు అలా జరిగింది అని వార్త రాశారు. దాంతో మా ఇంట్లో నాపై నమ్మకం పెరిగింది. నేను మీడియాపై కక్ష సాధింపు చర్యకోసం మాత్రం ఇందులో నటించలేదు. ఈ సిరీస్ లో నేనే జర్నలిస్ట్ ని అని అన్నారు. దీంతో నవదీప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.