Navarasa: వావ్‌.. టీజర్‌ ఇలా కూడా ఉంటుందా?

ఒకప్పుడు సినిమా ఎలా ఉంటుందో ముందు రుచి చూపేదిగా ట్రైలర్ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో కూడా చెప్పేందుకు మన సినీ మేకర్స్ టీజర్ ను వాడేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో శైలిలో.. వినూత్నంగా ఈ టీజర్లను క్రియేట్ చేసి తన సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులలో ఉత్సుకత పెంచేస్తున్నారు. అయితే.. అతి కొద్దిమంది మేకర్స్ మాత్రం సినిమా.. వెబ్ సిరీస్.. షార్ట్ ఫిల్మ్.. ఫ్లాట్ ఫామ్ ఏదైనా తమ సృజనాత్మకతతో ఈ టీజర్లను రూపొందించి విడుదల చేసి వారి సినిమాలు భిన్నంగా ఉంటాయని చూపిస్తున్నారు.

Navarasa: వావ్‌.. టీజర్‌ ఇలా కూడా ఉంటుందా?

Navarasa

Navarasa: ఒకప్పుడు సినిమా ఎలా ఉంటుందో ముందు రుచి చూపేదిగా ట్రైలర్ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ ట్రైలర్ ఎలా ఉంటుందో కూడా చెప్పేందుకు మన సినీ మేకర్స్ టీజర్ ను వాడేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో శైలిలో.. వినూత్నంగా ఈ టీజర్లను క్రియేట్ చేసి తన సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులలో ఉత్సుకత పెంచేస్తున్నారు. అయితే.. అతి కొద్దిమంది మేకర్స్ మాత్రం సినిమా.. వెబ్ సిరీస్.. షార్ట్ ఫిల్మ్.. ఫ్లాట్ ఫామ్ ఏదైనా తమ సృజనాత్మకతతో ఈ టీజర్లను రూపొందించి విడుదల చేసి వారి సినిమాలు భిన్నంగా ఉంటాయని చూపిస్తున్నారు. అలాంటి ఓ వెబ్ సిరీస్ టీజర్ ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటుంది.

మణిరత్నం సమర్పణలో వస్తున్న నవరస వెబ్ సిరీస్ శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్ట్ లో 6వ తేదీన స్ట్రీమ్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా మొత్తం తొమ్మిది ఎపిసొడ్ లతో రానున్న ఈ వెబ్ సిరీస్ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకట్, బెజాయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజు, అరవింద్ స్వామి, సర్జున్, కార్తిక్ నరేన్, ప్రియదర్శన్, వసంత్, రతింద్రన్ లు దర్శకత్వం వహించారు.

ఇక ఇందులో సూర్య, రేవతి, సిద్ధార్ద్, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఐశ్వర్య రాజేష్ లు సైతం నటించారు. ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లే మేకర్స్ కూడా విభిన్నంగా ఈ టీజర్ తెచ్చారు. సిరీస్ పేరుకు తగ్గట్లే నటుల చేత నవరసాలను పలికిస్తూ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ థీమ్ లో టీజర్ రూపొందించారు. కరోనా మహమ్మారి వల్ల చితికిపోయిన సినీ కార్మికులకి అండగా నిలిచేందుకు దర్శకుడు మణిరత్నం, నిర్మాత జయేంద్ర కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.