Naveen Chandra: క్రైమ్ సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న నవీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైలర్..!

టాలీవుడ్‌లో తనదైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యంగ్ యాక్టర్ నవీన్ చంద్ర, ప్రస్తుతం పలు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయమై, ఆ తరువాత నెగెటివ్, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ టాలీవుడ్‌లో బిజీ యాక్టర్‌గా మారాడు.

Naveen Chandra: క్రైమ్ సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న నవీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైలర్..!

Naveen Chandra: టాలీవుడ్‌లో తనదైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యంగ్ యాక్టర్ నవీన్ చంద్ర, ప్రస్తుతం పలు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయమై, ఆ తరువాత నెగెటివ్, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ టాలీవుడ్‌లో బిజీ యాక్టర్‌గా మారాడు. ఇక ప్రస్తుతం వరుసగా వెబ్ మూవీస్‌లో నటిస్తున్న నవీన్ చంద్ర, ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Naveen Chandra : వైఫ్‌తో ఫస్ట్ టైం ఫోటో షేర్ చేసిన నవీన్ చంద్ర.. నవీన్ చంద్ర వైఫ్‌ని చూశారా?

‘రిపీట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అరవింద్ శ్రీనివాసన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ పవర్‌ఫుల్ కాప్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 1న నేరుగా స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

నవీన్ చంద్ర కొత్త సినిమా ప్రారంభం

ఇక ఈ సినిమాలో స్మృతి వెంకట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మధు షా, అచ్యుత్ కుమార్, సత్యం రాజేష్, పూజా రామచంద్రన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ‘రిపీట్’ చిత్రాన్ని ఆడియెన్స్ ఏమేర ఆదరిస్తారో చూడాలి.