Naveen Polishetty : త్రివిక్రమ్‌తో నవీన్ సినిమా..

త్రివిక్రమ్ నిర్మాణ సంస్థలో ఆయన భార్య సాయి సౌజన్య, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ నిర్మాతలుగా.. యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా సినిమా చెయ్యబోతున్నట్లు ప్రకటించారు..

Naveen Polishetty : త్రివిక్రమ్‌తో నవీన్ సినిమా..

Naveen Polishetty

Naveen Polishetty: నవీన్ పోలిశెటి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత బాలీవుడ్‌లో దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ‘చిచ్చోరే’ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌తో టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ‘జాతిరత్నాలు’ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించింది నవీన్ క్యారెక్టరే.

Bigg Boss 5 Telugu : ‘లవ్ స్టోరీ’ కోసం చైతు – సాయి పల్లవి..

ఇప్పుడీ యంగ్ సెన్సేషన్ హీరోతో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ సినిమా చెయ్యబోతోంది. ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ అనే బ్యానర్ మీద భార్య సాయి సౌజన్య నిర్మాతగా త్రివిక్రమ్ సినిమాలు చెయ్యబోతున్నారు. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజు అయిన(1931, సెప్టెంబర్ 15) రోజునే ఈ ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థ పురుడు పోసుకోవడం విశేషం.

Leharaayi : యూత్ లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్నారు..

ఇప్పటివరకు చినబాబుకి చెందిన ‘హారిక – హాసిని’ బ్యానర్‌లో దర్శుకుడిగా ఎక్కువ సినిమాలు చేసిన త్రివిక్రమ్.. ఆ సంస్థకు అనుబంధ సంస్థ అయిన సితార బ్యానర్‌తో నిర్మాణ భాగస్వామ్యం వహించబోతున్నారు. త్రివిక్రమ్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ – సాయి సౌజన్యలు నిర్మాతలుగా.. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ నటించనున్న 4వ చిత్రం తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సితార సంస్థ నిర్మిస్తున్న 15వ సినిమా ఇది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో.. ఫన్ ఫిల్లెడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.