తారక్ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్..

తారక్ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్..

Naveen Polishetty: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత స్టార్ట్ కానుంది.

NTR 30

తారక్ నటిస్తున్న 30వ సినిమా ఇది.. గతకొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్‌లో చెయ్యబోయే హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ టీం అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు. తాజాగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి ఈ సినిమాలో నటిస్తున్నాడనే విషయం తెలిసింది.

Naveen Polishetty

అప్పటివరకు చిన్నా చితకా పాత్రలు చేసిన నవీన్ పొలిశెట్టికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.. తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘చిచ్చోరే’ మూవీలో హీరో ఫ్రెండ్ హిమాన్షు క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు. అతని పర్ఫార్మెన్స్‌కి ఫిదా అయిన త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాలో ఓ కీ క్యారెక్టర్ కోసం నవీన్‌ని ఫిక్స్ చేశారని, తనది నెగెటివ్ రోల్ అని తెలుస్తోంది.

Naveen Polishetty