Nawazuddin Siddiqui : స్టార్ యాక్టర్స్‌తో కూర్చొని తిందాం అనుకుంటే కాలర్ పట్టుకొని బయటకి లాగేశారు.. కెరీర్లో అవమానాల గురించి చెప్పిన నవాజుద్దీన్..
గత కొన్ని రోజులుగా తన భార్యతో ఉన్న గొడవలతో వార్తల్లోనూ నిలుస్తున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కున్న అవమానాల గురించి తెలిపాడు.

Nawazuddin Siddiqui shares her career starting emotional incidents
Nawazuddin Siddiqui : బాలీవుడ్(Bollywood) లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ కెరీర్ మొదలుపెట్టిన నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రస్తుతం స్టార్ యాక్టర్. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మెయిన్ లీడ్స్ లోను పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగులో కూడా వెంకటేష్(Venkatesh) సైంధవ్(Saindhav) సినిమాలో కనిపించబోతున్నాడు. గత కొన్ని రోజులుగా తన భార్యతో ఉన్న గొడవలతో వార్తల్లోనూ నిలుస్తున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కున్న అవమానాల గురించి తెలిపాడు.
Mahesh Babu : ఫంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో మహేశ్ బాబు సెల్ఫీలు.. మహేశ్ ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాడా?
నవాజుద్దీన్ సిద్దిఖీ మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో, స్టార్ యాక్టర్ అవ్వకముందు సినీ పరిశ్రమలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. సెట్ లో ఎవరూ పట్టించుకునేవారు కాదు. ప్రొడక్షన్ బాయ్ ని కనీసం మంచినీళ్లు అడిగినా ఇచ్చేవాళ్లు కాదు. సెట్స్ లో అందరూ కలిసి భోజనాలు చేయరు. స్టార్స్ కి ఒకచోట, జూనియర్ ఆర్టిస్టులకి ఒకచోట భోజనం పెట్టేవారు. ఓ సారి స్టార్స్ తో కలిసి భోజనం చేయాలనిపించింది. స్టార్స్ తినే దగ్గరకి వెళ్లి తినడానికి కూర్చున్నాను. భోజనం పెడతారు అనుకునే లోపే కొంతమంది సిబ్బంది వచ్చి నా కాలర్ పట్టుకొని బయటకు లాగేశారు. ఆ రోజు చాలా బాధపడ్డాను అని తెలిపారు. దీంతో బాలీవుడ్ లో నవాజుద్దీన్ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.