Nayan-Vignesh : నయన్-విగ్నేష్ ఎంత గొప్ప మనసో.. పెళ్ళికి లక్షమంది ఆనాధలు, వృద్ధులు, పేదలకు భోజనాలు..

ఇలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడమే కాదు, గుర్తుండిపోయే ఓ మంచి పని కూడా వీరి పెళ్లి రోజున చేశారు. అన్ని దానాల్లో అన్నదానం గొప్ప అనే మాటని పాటించి నయన్ -విగ్నేష్ పెళ్లి సందర్భంగా...................

Nayan-Vignesh : నయన్-విగ్నేష్ ఎంత గొప్ప మనసో.. పెళ్ళికి లక్షమంది ఆనాధలు, వృద్ధులు, పేదలకు భోజనాలు..

Nayan Vignesh

Nayan-Vignesh :  గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తాజాగా చెన్నైలో జూన్‌ 9న పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సెలబ్రిటీల మధ్య ఘనంగా చేసుకున్నారు. వీరి పెళ్ళికి సౌత్, నార్త్ సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఇక పెళ్లి అయ్యాక డైరెక్ట్ తిరుమలకి వెళ్లి స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నారు.

అయితే ఇలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడమే కాదు, గుర్తుండిపోయే ఓ మంచి పని కూడా వీరి పెళ్లి రోజున చేశారు. అన్ని దానాల్లో అన్నదానం గొప్ప అనే మాటని పాటించి నయన్ -విగ్నేష్ పెళ్లి సందర్భంగా తమిళనాడులోని పలు అనాధాశ్రమాలు, వృద్దాశ్రమాల్లో ఉన్న దాదాపు లక్షమంది అనాధలకు, వృద్ధులకు, పేదలకు మంచి విందు భోజనం పెట్టించారు.

Virata Parvam : ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. ముఖ్యంగా మహిళల సినిమా..

అలా ఎంతోమందికి ఒక రోజు కడుపు నింపినందుకు వారంతా ఈ జంట చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. నయనతార అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తమిళనాడు వ్యాప్తంగా జరిగింది. దీనికి కావాల్సిన మొత్తం డబ్బుని వీరే అందచేశారు. వీరి పెళ్లి సందర్భంగా ఇలాంటి మంచి పని చేసిన వీరిద్దర్నీ అందరూ అభినందిస్తున్నారు.