Nayanatara : ప్రియుడితో కలిసి అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న నయన్

ఈ రోజు నయనతార పుట్టినరోజు. ఈ సంవత్సరం తన 37వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నయన్ ప్రియుడు, కాబోయే భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ నిన్న అర్ధరాత్రి నయన్‌ పుట్టిన రోజుని

Nayanatara : ప్రియుడితో కలిసి అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు జరుపుకున్న నయన్

Nayan

Nayanatara :   లేడీ సూపర్‌స్టార్‌ నయనతార గత కొన్ని రోజులుగా తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ తోనే ఎక్కువగా తిరుగుతుంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాము అంటూ ఇద్దరూ కలిసి ఇటీవల తీర్థయాత్రలు కూడా చేశారు. ఇటీవల నయన్ ఎక్కువగా తన ప్రియుడితోనే ఉంటుంది. తాజాగా తన ప్రియుడితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది.

Prabhas : ప్రభాస్ పేరుతో అభిమాని హెయిర్ స్టైల్.. ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రభాస్

ఈ రోజు నయనతార పుట్టినరోజు. ఈ సంవత్సరం తన 37వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నయన్ ప్రియుడు, కాబోయే భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ నిన్న అర్ధరాత్రి నయన్‌ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు. నిన్న నైట్ స్పెషల్‌ పార్టీతో నయనతారని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఆకాశమంతా బాణాసంచా కాల్చాడు. నిన్న రాత్రి నయన్ తో కేక్ కట్ చేయించి బర్త్‌డే సంబరాలు జరిపాడు. చెన్నైలోని విగ్నేష్ శివన్ ఇంట్లో ఈ పార్టీ జరిగినట్లు తెలుస్తుంది. ఈ పార్టీలో నయనతార నయన్‌ కుటుంబసభ్యులు, వీళ్లిద్దరి ఫ్రెండ్స్ కూడా హాజరయినట్లు తెలుస్తుంది.

Puneeth Rajkumar : పునీత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టిన పునీత్ భార్య

తమ అభిమాన హీరోయిన్‌కు ఫ్యాన్స్‌తో పాటు, పలువురు సినీ ప్రముఖులు కూడా నయనతారకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలియచేస్తున్నారు. ఇలా విగ్నేష్, నయన్ లు కలిసి ఉంటూ ఎంజాయ్ చేస్తుంటే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.