Nayanatara : ఆస్కార్ బరిలో నయనతార సినిమా

2021 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో మన సినిమాలు కూడా ఆస్కార్ బరిలో ఉంటాయి. గత సంవత్సరం 'ఆకాశమే నీ హద్దురా' సినిమా కూడా

Nayanatara :  ఆస్కార్ బరిలో నయనతార సినిమా

Nayanatara

Nayanatara :  2021 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులు త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో మన సినిమాలు కూడా ఆస్కార్ బరిలో ఉంటాయి. గత సంవత్సరం ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా కూడా ఆస్కార్ బరిలో చివరి దాకా నిలిచింది. ఇటీవల మన దేశంలో కూడా మంచి కంటెంట్ ఉండే సినిమాలు చాలా వస్తున్నాయి. మన దేశం నుంచి ఓ కమిటీ బెస్ట్ సినిమాలని చూసి అందులో ఒక సినిమాని ఈ కేటగిరిలో ఆస్కార్ బరిలోకి పంపిస్తుంది. మొత్తం దేశంలోని వివిధ భాషల్లో 15 సినిమాలని చూసిన కమిటీ ఒక సినిమాని ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నిలిపింది. ఆ సినిమా నిర్మాత నయనతార కావడం విశేషం.

లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నయనతార నిర్మించిన ‘కూజంగల్‌’ అనే తమిళ చిత్రం ఆస్కార్‌ ఎంట్రీని దక్కించుకున్నది. తన నిజ జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు పి.ఎస్‌ వినోథ్‌రాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాగుబోతు తండ్రికి, అతడికి కుమారుడికి మధ్య చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 2021 సంవత్సరానికిగాను ప్రదానం చేయనున్న 94వ ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం తరపున ఎంపికైంది.

Anasuya : తమన్నాని రీప్లేస్ చేసిన అనసూయ.. తమన్నా కంటే రంగమ్మత్త రేంజ్ ఎక్కువ??

‘కూజంగల్‌’ ఆస్కార్‌ బరిలో నిలవడం పట్ల నిర్మాత విఘ్నేష్‌ శివన్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఆస్కార్‌ గెలుచుకునేందుకు కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నాం. నిర్మాతగా మంచి కంటెంట్‌ను తెరకెక్కించినందుకు గర్వపడుతున్నా అని తెలిపారు. ఇకపై కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందిస్తాను అని తెలిపారు.